విశాఖపట్నం రానున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారు అయింది.

By Medi Samrat
Published on : 24 Nov 2024 9:00 PM IST

విశాఖపట్నం రానున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం రానున్నారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారు అయింది. సిరిపురం జంక్షన్‌లో రోడ్‌షో, ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్‌ లకు శంకుస్థాపన చేయనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది.

అనకాపల్లి జిల్లాలోని పూడిమడకలో భారతదేశపు అతిపెద్ద NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మద్దిలపాలెంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొని, అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్‌షో నిర్వహించాలని యోచిస్తున్నారు.

Next Story