విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో

By Medi Samrat  Published on  20 Dec 2023 4:09 PM IST
విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఆయ‌న‌కు విమానాశ్రయంలో జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

టీడీపీ, జనసేన పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల‌లో క‌లిసి పోటీ చేస్తామ‌ని ఏకాభిప్రాయం కుదుర్చుకున్నాక‌.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి. ఈ సభ ద్వారా ఇరువురు నేత‌లు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించబోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే.. బహిరంగ సభకు 110 ఎకరాల స్థలంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 5, 6 లక్షల మoది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 50 వేల మంది కూర్చుని బహిరంగంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. స్టేజీ 180 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు.. స్టేజీపై 600 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. స్టేజీ వెనుక 50 అడుగుల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు.

Next Story