నేడు విశాఖలో GFST (గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ ఫర్మేషన్) నిర్వహిస్తున్న సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. షేపింగ్ ది నెక్ట్స్ ఎరా ఆఫ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ తో ఒక రోజు సదస్సు నిర్వస్తుండగా.. వివిధ అంశాలపై 5 సెషన్లుగా జరిగే సదస్సులో ఆయా రంగాల్లో నిపుణులతో చర్చలు జరుపనున్నారు. టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలతో మెరుగైన పాలన అందించడం, ప్రజల తలసరి ఆదాయం పెంచడం వంటి అంశాలు అజెండాగా సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముఖ్యమంత్రి సదస్సులో పాల్గొననున్నారు.. సాయంత్రం అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.