డాక్టర్ పేరుతో బిల్డప్.. 20 మంది యువతులకు వల..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Nov 2019 4:53 AM GMTవిశాఖ: ఎంబీబీఎస్ చదవలేదు. స్టెతస్కోప్ ఎలా ఉంటుందో తెలియదు. కనీసం సిరంజీ గురించి వినలేదు. కానీ డాక్టర్‌లా బిల్డప్ ఇచ్చాడు. డూప్లికేట్ ఫోటోలు చూపించాడు. ఒక్కరు కాదు. ఇద్దరు కాదు. ఇరవై మంది మహిళలకు వల వేశాడు. లైంగికంగా అనుభవించాడు. ఫోటోలు తీసి ఆపై బ్లాక్ మెయిల్ చేసి నిలువునా దోచుకున్నాడు. చివరకు ఓ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతో పాపం పండింది. ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లాడు.
విశాఖలో కేటుగాడి వ్యవహారం బయటపడింది. వంకా కుమార్ అలియాస్ డాక్టర్ అజిత్ కమార్. మెడలో స్టెత్‌స్కోప్. డాక్టర్‌లా బిల్డప్. వైద్యుడి వేషంలో ఫోటోలు తీసుకుని వాటిని మహిళలకు చూపించి..మాయమాటలతో ట్రాప్ చేసి..వారిని లైంగికంగా వాడుకోవడం వీడికి అలవాటు.
ఆతర్వాత ఆ ఫోటోలు, వీడియోలు చూపించి డబ్బులు వసూలు చేయడం మరో హాబీ. వారి దగ్గర నగదు, నగలు దోచుకున్నాడు. పెళ్లైన మహిళలను టార్గెట్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. తులాల కొద్దీ బంగారం, లక్షల కొద్దీ నగదు వసూలు చేశాడు.
ఇప్పటివరకూ 20 మంది మహిళలు వీడి వలలో పడ్డారు. చివరిగా ఓ బాధితురాలు ధైర్యంతో ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసును సీరియస్‌గా టేకప్ చేసి వంకా కుమార్‌పై చీటింగ్,రేప్‌తో పాటు ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎట్టకేలకు ఈ నకిలీ డాక్టర్‌ను అరెస్టు చేశారు. వీడితో చేతులు కలిపి ఫోటోలు తీస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు సహకరించిన మణికంఠను కూడా ఈ కేసులో నిందితుడుగా చేర్చారు.