Viral Video : పెళ్లి కూతురికి బహుమతి ఇచ్చి పెళ్లి కొడుకుపై దాడి.. అసలు విషయం ఏమిటంటే.?

వరుడిపై టీచర్ కత్తితో దాడి చేసిన షాకింగ్ ఘటన చిత్తోర్‌గఢ్ జిల్లా ఉండ్చా గ్రామంలో చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on  21 May 2024 12:07 PM IST
Viral Video : పెళ్లి కూతురికి బహుమతి ఇచ్చి పెళ్లి కొడుకుపై దాడి.. అసలు విషయం ఏమిటంటే.?

వరుడిపై టీచర్ కత్తితో దాడి చేసిన షాకింగ్ ఘటన చిత్తోర్‌గఢ్ జిల్లా ఉండ్చా గ్రామంలో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ వరుడు కేవలం తలకు స్వల్ప గాయంతో బయటపడ్డాడు. విషయం తెలుసుకుని ఘటనా స్థలంలోకి పోలీసులు రంగప్రవేశం చేశారు. కృష్ణ, మహేంద్రల వివాహ వేడుక సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు వధువు సోదరుడు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని ఉండ్రా నివాసి శంకర్‌లాల్ భారతిగా గుర్తించారు. వరుడిపై దాడికి దిగడానికి ముందు శంకర్‌లాల్ వధువుకు బహుమతిని అందించాడు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాడి చేసిన తరువాత, శంకర్‌లాల్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. మే 12న ఈ ఘటన జరిగిందని వధువు సోదరుడు విశాల్ సైన్ తెలిపారు. శంకర్‌లాల్ - వధువు కృష్ణ గతంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కలిసి పనిచేశారని తెలిసింది. కృష్ణ-శంకర్ లాల్ మధ్య విభేదాల కారణంగా ఈ దాడి జరిగిందని దర్యాప్తులో తేలింది. నిందితుడైన యువకుడితో పాటు అతని సహచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను దిగ్భ్రాంతికి గురి చేసింది.

Next Story