ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని ఒక ఆభరణాల షోరూమ్ లో ఒక జంట బంగారు హారాన్ని దొంగిలించింది. కస్టమర్లుగా నటిస్తూ ఉన్న వీడియో వైరల్‌గా మారింది. దుకాణదారుడు స్టాక్ తనిఖీలను ముగించే సమయంలో ఆరు గ్రాముల బంగారం కొరతను గమనించాడు. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ నెక్లెస్‌లను చూస్తుండగా, చాకచక్యంగా ఒక నెక్లెస్‌ను తన చీర కింద ఉంచి తన సహచరుడితో కలిసి దుకాణం నుండి బయటకు వెళ్లిందని CCTV ఫుటేజ్‌లో స్ఫష్టంగా కనిపించింది.
కొట్టేసిన బంగారు నెక్లెస్ విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని పేర్కొంటూ జ్యువెలరీ షోరూమ్ యజమాని గౌరవ్ పండిట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పష్టమైన ఫుటేజ్ ఉన్నప్పటికీ, నిందితుల జాడ ఇంకా తెలియలేదు.