Viral Video : న‌డిరోడ్డుపై జుట్లు ప‌ట్టుకుని కొట్టుకున్న‌ నలుగురు అమ్మాయిలు

నోయిడా సెక్టార్-93లో ఉన్న బయోడైవర్సిటీ పార్క్ దగ్గర అమ్మాయిల గ్రూపులు ఘర్షణ పడ్డాయి. ఒకరినొకరు జుట్టు పట్టుకుని లాగుతూ చాలాసేపు గొడవ ప‌డ్డారు

By Medi Samrat  Published on  1 May 2024 8:15 AM IST
Viral Video : న‌డిరోడ్డుపై జుట్లు ప‌ట్టుకుని కొట్టుకున్న‌ నలుగురు అమ్మాయిలు

నోయిడా సెక్టార్-93లో ఉన్న బయోడైవర్సిటీ పార్క్ దగ్గర అమ్మాయిల గ్రూపులు ఘర్షణ పడ్డాయి. ఒకరినొకరు జుట్టు పట్టుకుని లాగుతూ చాలాసేపు గొడవ ప‌డ్డారు. దీంతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. కొంతమంది యువకులు జోక్యం చేసుకోవడానికి వచ్చారు.. కాని ఆ పోరాటం కొనసాగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్‌లో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న ఫేజ్-2 కొత్వాలి పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఆ యువ‌తుల‌ను పోలీస్ స్టేషన్‌కు త‌ర‌లించారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వ్యాఖ్యల కారణంగానే అమ్మాయిల మధ్య ఈ గొడవ జరిగిందని చెబుతున్నారు. గొడ‌వ కార‌ణంగా.. నిశబ్దంగా ఉన్న రహదారి క్ష‌ణాల్లో రణరంగంగా మార్చేశారు అమ్మాయిలు. అమ్మాయిలను మళ్లీ గొడవ చేయవద్దని పోలీసులు ఒప్పించారు. ఈ గొడ‌వ‌లో ఇద్దరు టీనేజ్ అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఇరువర్గాల తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బాలికలను అప్పగించారు.

Next Story