బీటెక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అఘోరీ.. వీడియో వైరల్
లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఓ యువతిని వివాహం చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
By Knakam Karthik
బీటెక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అఘోరీ.. వీడియో వైరల్
తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఓ యువతిని వివాహం చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్షిణీ అనే యువతిని అఘోరీ పెళ్లి చేసుకుంది. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి వర్షిణిని వెంటతీసుకుని తిరుగుతున్న అఘోరి.. తాజాగా ఆ వర్షిణిని పెళ్లాడింది. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలో వర్షిణీ మెడలో అఘోరీ తాళి కట్టడంతో పాటు దండాలు మార్చుకున్న దృశ్యాలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వర్షిణి, అఘోరి ఇద్దరూ దండలు మార్చుకోవడం, తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి. పలువురు భక్తులు పాటలు పాడుతూ సదరు జంటను ఆశీర్వదించారు.
అయితే ఏపీలోని నందగామలో నందిగామలో అఘోరీకి వర్షిణికి పరిచయం ఏర్పడింది. వివస్త్రగా ఉన్న అఘోరికి వర్షిణి సాయం చేయడం, ఆ తర్వాత వర్షిణి కుటుంబ సభ్యుల ఆహ్వానంతో అఘోరి వారి ఇంట్లో కొన్నిరోజులు గడిపింది. అక్కడి నుంచి వెళ్లిపోతూ వర్షిణిని కూడా అఘోరి తన వెంట తీసుకెళ్లింది. గుజరాత్‌లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లగా వర్షిణి కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లి ఇంటికి తీసుకువచ్చారు. కొన్ని రోజుల ఇంట్లో ఉన్న వర్షిణీ మళ్లీ లేడీ అఘోరీతో వెళ్లిపోయింది. తాజాగా అఘోరి, వర్షిణీ పెళ్లి వీడియో బయటికి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రీ వర్షిణిని పెళ్లి చేసుకున్న అఘోరి #Aghori #SriVarshini #AghoriMarriage pic.twitter.com/QMuPDdfmw9
— C L N Raju (@clnraju) April 15, 2025