ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌లో ఊహించని మలుపు తిరిగింది. బీజేపీ సీనియర్ నాయకులతో నిండిపోయిన వేదిక అకస్మాత్తుగా కిందకు దిగిపోయింది. దీంతో వధువు, వరుడు, డజనుకు పైగా అతిథులు నేలపై పడిపోయారు. ఈ సంఘటన కెమెరాలో రికార్డైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుధవారం రాంలీలా మైదానంలో బీజేపీ నాయకుడు అభిషేక్ సింగ్ ఇంజనీర్ సోదరుడి రిసెప్షన్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజయ్ మిశ్రా, మాజీ ఎంపీ భరత్ సింగ్, ఎమ్మెల్యే కేతకి సింగ్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుర్జిత్ సింగ్, అనేక మంది నాయకులు వధూవరులను పలకరించడానికి వేదికపైకి ఎక్కినప్పుడు వధూవరులు ఆశీర్వచనాలు ఇచ్చారు.