Fact Check : పంజాబ్ లో మహిళా పోలీసును అత్యాచారం చేసి చంపేశారంటూ వైరల్ అవుతున్న పోస్టులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Oct 2020 8:38 AM IST
Fact Check : పంజాబ్ లో మహిళా పోలీసును అత్యాచారం చేసి చంపేశారంటూ వైరల్ అవుతున్న పోస్టులు..!

పంజాబ్ పోలీసు విభాగంలో పని చేసే మహిళా పోలీసును చంపేశారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమెను అత్యాచారం చేసి చంపేశారంటూ పలువురు కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ఉన్నారు. విగతజీవిగా పడి ఉన్న మహిళ.. పోలీసు యూనిఫామ్ లో ఉంది.



‘पंजाब में पुलिस महिला कांस्टेबल की हत्या क्या पुलिस भी सुरक्षित नही है उत्तर में हाँ पूरे भारत में कोई बेटियाँ सुरक्षित नहीं है. Corona काल में bill पास हो जाते हैं रातों रात कानून बन जाते हैं लेकिन बेटियों के साथ रोज rape होते हैं उसके लिए कोई कठोर कानून क्यों बनाती सरकार.’ అంటూ హిందీలో ఓ మెసేజీని వైరల్ చేస్తున్నారు. 'పోలీసు కానిస్టేబుల్ ను పంజాబ్ లో చంపేశారు. పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందా..? సమాధానం: అవును, భారత్ లో ఆడవాళ్ళకు కనీసం రక్షణ లేకుండా పోయింది. కరోనా కాలంలో బిల్లులు రాత్రికి రాత్రే పాస్ చేస్తారు.. చట్టాలను సులువుగా మార్చి వేస్తారు.. కానీ ఆడవాళ్లు ప్రతి రోజూ అత్యాచారానికి గురవుతూ ఉన్నారు. భారత ప్రభుత్వం ఎందుకు కఠినమైన చట్టాలను తీసుకుని రాలేకపోతోంది.' అన్నది వైరల్ అవుతున్న పోస్టులోని సారాంశం.



" Woman cop dies in road accident - The Tribune India

Have some shame.. you can get punished for spreading false news. Truth is this 1 day ago · A woman police constable , Nomi, posted at miscellaneous store keeping (MSK) branch here died after a speedy SUV hit her scooter ... " అంటూ మరో పోస్టు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ మహిళా కానిస్టేబుల్ చనిపోడానికి కారణం రోడ్డు ప్రమాదమే అని ఆ పోస్టులో ఉంది. ఆమె స్కూటర్ ను వేగంగా వెళుతున్న కారు గుద్దడమే కారణమని చెబుతూ వచ్చారు.

నిజ నిర్ధారణ:

లేడీ కానిస్టేబుల్ ను అత్యాచారం చేసి చంపేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

ఈ ఘటన గురించి చాలా మంది సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. TribuneIndia.com లింక్ ను చూపిస్తూ వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదని తెలిపింది.



నోమి అనే మహిళా కానిస్టేబుల్ తన ద్విచక్ర వాహనంలో వెళుతూ ఉంటే ఓ వాహనం ఢీకొట్టింది.. దీంతో ఆ మహిళ కాస్తా మరణించింది. సంగత్ పురా గ్రామంలో అక్టోబర్ 1, 2020న మరణించింది.



Jagran మీడియా సంస్థ కూడా ఈ ఘటన గురించి కథనాన్ని రాసుకుని వచ్చింది. డిఎస్పి అజ్నాల విపిన్ కుమార్ మాట్లాడుతూ కాలా అఫ్ఘానా గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ కు అమృత్ సర్ లోని రోమన్ కమిషనరేట్ ఎంఎస్కె బ్రాంచ్ లో బాధ్యతలు ఇచ్చారు. ఆమె తమ గ్రామం నుండి ప్రతి రోజూ తన యాక్టివాలో వెళ్ళేది. చేతన్ పురా గ్రామంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వెళుతున్న యాక్టివా ఢీకొట్టింది. ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది. డిఎస్పి విపిన్ కుమార్ మాట్లాడుతూ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించామని.. ఘటనకు బాధ్యులను ట్రేస్ చేశామని అన్నారు.

PunjabKesari.com లో కూడా ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు. చనిపోయిన మహిళా కానిస్టేబుల్ నోమి ఫోటోలను గమనించవచ్చు.

మహిళా పోలీసు కానిస్టేబుల్ ను రేప్ చేసి చంపేశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Claim Review:Fact Check : పంజాబ్ లో మహిళా పోలీసును అత్యాచారం చేసి చంపేశారంటూ వైరల్ అవుతున్న పోస్టులు..!
Claim Reviewed By:Satya Priya
Claim Fact Check:false
Next Story