Fact Check : నరేంద్ర మోదీ తెలుపు రంగు గౌన్ లో ఉన్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Sep 2020 6:04 AM GMT
Fact Check : నరేంద్ర మోదీ తెలుపు రంగు గౌన్ లో ఉన్నారా..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుపు రంగు గౌన్ ధరించి ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఆ ఫోటోలో నరేంద్ర మోదీ చుట్టూ పలువురు ఉన్నారు. వారందరూ సూట్స్ ధరించి ఉన్నారు. చైనా లోని జియాన్ మ్యూజియం నుండి వారందరూ నడుచుకుంటూ బయటకు వస్తూ ఉన్నారు.

“India ki selfie queen” భారత్ సెల్ఫీ క్వీన్ అంటూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

భారత ప్రధాని నరేంద్ర మోదీ అటువంటి డ్రెస్ ను వేసుకోలేదు. ఫోటోను మార్ఫింగ్ చేశారు.

ఈ ఫోటోను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అలాంటి ఫోటోనే ‘India today’ప్రచురించింది. తమ గ్యాలరీలో 11వ నెంబర్ ఫోటోగా దీన్ని అప్లోడ్ చేశారు. “PM Modi coming out from the Terracotta Warriors Museum in Xi’an” చైనా లోని జియాన్ లోని టెర్రాకోటా మ్యూజియం నుండి మోదీ బయటకు వస్తున్నారు అని అందులో రాసి ఉంది. మోదీ తెలుపు రంగు కుర్తాను ధరించి ఉండగా చేతుల్లో ఒక శాలువ ఉంది.

‘Indian Express’ అప్ లోడ్ చేసిన 23వ ఫోటో కూడా ఇదే..! “Prime Minister Narendra Modi during his visit to Terracotta Warriors Museum in Xi’an, China on Thursday” అనే టైటిల్ తో ఫోటోను అప్లోడ్ చేశారు.

M1

ఒరిజినల్ ఫోటోకు మార్ఫింగ్ చేసిన ఫోటోకు ఉన్న తేడాను గమనించవచ్చు.



నరేంద్ర మోదీ కూడా ఇదే ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. మే 2015న ఆయన ఈ ఫోటోను ట్వీట్ చేశారు. చైనా లోని జియాన్ నుండి హాయ్ చెప్పారు. అద్భుతమైన టెర్రాకోటా మ్యూజియంను సందర్శించడం జరిగిందని అన్నారు.

వైరల్ అవుతున్న ఫోటో 'మార్ఫింగ్ చేసినది'.

Next Story