నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన

Chandrababu Visit For Kuppam. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లాలోని కుప్పంలో

By Medi Samrat  Published on  15 Nov 2021 9:15 AM IST
నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికను పరిశీలించనున్నారు. కుప్పం మున్సిపాల్టీకి ఎన్నిక జరుగుతుండటంతో అక్కడ అధికార వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తోంది. దొంగ ఓట్లు వేసేందుకు ఇప్పటికే వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులను మోహరించిందని, రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు డీజీపీ, ఇతర రాజ్యాంగబద్ద సంస్థలకు టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబు ప‌ర్య‌ట‌న నేఫ‌థ్యంలో పోలీసులు భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు.


Next Story