మనకు ఎన్ని కష్టాలున్నా అండ‌గా నిలుద్దాం : టీడీపీ శ్రేణుల‌కు చంద్ర‌బాబు పిలుపు

Chandrababu Teleconference With Party Leaders. వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న టీడీపీ నాయకులతో అధినేత‌ చంద్రబాబు నాయుడు టెలికాన్పరెన్స్

By Medi Samrat
Published on : 20 Nov 2021 6:48 PM IST

మనకు ఎన్ని కష్టాలున్నా అండ‌గా నిలుద్దాం : టీడీపీ శ్రేణుల‌కు చంద్ర‌బాబు పిలుపు

వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న టీడీపీ నాయకులతో అధినేత‌ చంద్రబాబు నాయుడు టెలికాన్పరెన్స్ నిర్వ‌హించారు. భారీ వర్షాలతో జలదిగ్భందంలో చిక్కుకున్న రాయలసీమ జిల్లాలు సహా నెల్లూరులోని పలు ప్రాంతాల్లోని ప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితికి వచ్చేవరకు అండగా నిలవాలని అన్నారు. ఎక్కడికక్కడ పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. వరద ప్రాంతాల్లో బాధితులకు ఆహరం అందించాలని సహాయ కార్యక్రమాలు చేపట్టాలని విజ్జప్తి చేశారు.

మనకు ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నా పక్కనబెట్టి ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలచి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో తాను కూడా పర్యటిస్తానని చెప్పారు. ప్రభుత్వం కన్నా ముందుగా స్పందించి సహయ కార్యక్రమాలు చెప్పట్టామని చెప్పారు. ఇప్పటికే ఎన్.టి.ఆర్ ట్రస్ట్, ఐటిడిపి తరుపున నిన్నటి నుండి వరద బాదితులకు ఆహరం, పాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఎన్.టి.ఆర్ ట్రస్ట్ తరుపున వైద్య సేవలు అందించాలని అన్నారు. పసిపిల్లలకు అవసరమైన పాలు, బిస్కెట్లు, మందులు, ఆహారం పంపిణీ చేయాలని కోరారు.

వరదల ధాటికి చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకపోయాయి, వంతెనలు కూలిపోయాయి, కరెంటు తీగలు తెగిపోయి విద్యుత్ సరఫరా నిలచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ జలదిగ్భందంలోనే ఉన్నారు. ఆహారం కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాలు కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నడూ బాధ్యత మరువలేదని, గతంలో ఉత్తరాఖండ్ వరదల సమయంలో కూడా అండగా నిలచామని అన్నారు. నేడు ముంపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలిందని అన్నారు. విస్తృత యంత్రాంగం ఉన్నా ప్రభుత్వం కనీసం పసి పిల్లులకు పాలు, వైద్య సదూపాయలు అందని దుస్థితి నెలకొందని తెలిపారు.


Next Story