అమరావతిని భ్రష్టుపట్టించి, పోలవరాన్ని గోదావరిలో కలిపారు.. వైసీపీపై సీఎం చంద్రబాబు విమర్శలు

గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని భ్రష్టు పట్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని గత ప్రభుత్వం గోదావరిలో కలిపిందని ఆరోపించారు.

By Knakam Karthik  Published on  16 Jan 2025 6:07 PM IST
ap government, cm Chandrababu, tdp, ysrcp, jagan, Polavaram, amaravati

అమరావతిని భ్రష్టుపట్టించి, పోలవరాన్ని గోదావరిలో కలిపారు.. వైసీపీపై సీఎం చంద్రబాబు విమర్శలు

గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని భ్రష్టు పట్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరాన్ని గత ప్రభుత్వం గోదావరిలో కలిపిందని ఆరోపించారు. రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 2.4ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు.

ప్రస్తుతం రూ.2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం.. అప్పటికి రూ.58.14 లక్షలు అవుతుందని తెలిపారు. సంపద సృష్టిస్తాం.. ప్రజల ఆదాయం పెంచుతామని సీఎం చంద్రబాబు దీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని చెప్పారు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంస్కరణలు తీసుకువచ్చానన్న ఆయన పవర్‌ సెక్టార్‌లో సంస్కరణల ద్వారా రాష్ట్రానికి వెలుగులు తెచ్చామని చెప్పారు. ఓపెన్‌ స్కై పాలసీ ద్వారా దుబాయ్‌-హైదరాబాద్‌ విమాన సర్వీసు ప్రవేశపెట్టినట్లు చెప్పిన ఆయన హైదరాబాద్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టామని అన్నారు. 163 కిలో మీటర్ల మేర ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అందుకే తెలంగాణకు హైదరాబాద్‌ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోందని సీఎం అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌, విజన్‌ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మాట్లాడిన ఆయన ఇంటిని జియో ట్యాగ్‌ చేసి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు.

ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలని.. వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో తాను చెప్పింది, ఇప్పుడు జరిగేది ప్రజలకు వివరించామని, ప్రజలను భాగస్వామ్యులను చేసుకుని ముందుకెళ్తున్నట్లు ఆయన వివరించారు. తాము రూపొందించిన విజన్ డాక్యుమెంట్‌కు దేశంలో తొలిసారి 16 లక్షల వ్యూస్ ఇచ్చారని, వికసిత్ భారత్‌కు కూడా ఈ స్థాయిలో స్పందని రాలేదని సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆన్‌లైన్‌లో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, పది సూత్రాలతో విజన్ డాక్యుమెంట్‌ను మళ్లీ రూపొదించామని చెప్పారు.

Next Story