ఓటు హక్కుపై సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేసిన హీరో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2020 5:10 PM IST
ఓటు హక్కుపై సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేసిన హీరో

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకుని.. అర్జున్ రెడ్డి సినిమాతో అఖండ విజ‌యాన్ని అందుకుని తెలుగులో తిరుగులేని హీరోగా విరాజిల్లుతున్న‌ విజయ్ దేవరకొండ తన ఆటిట్యూడ్‌‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవ‌ర‌కొండ టాలీవుడ్ డాషింగ్ డైరెక్ట‌ర్‌ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌.

అయితే.. తాజాగా విజ‌య్‌ ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మన రాజకీయ వ్యవస్థ అర్థం పర్థం లేకుండా ఉందని విజయ్ పేర్కొన్నాడు. ఓటు వేసే హక్కు పేద వాళ్లకు, డబ్బున్న వాళ్లకు ఉండకూడదని.. కేవలం మధ్య తరగతి వారికి మాత్రమే ఓటు హక్కు ఉండాలని అన్నాడు. అలాగే డ‌బ్బు, మ‌ద్యం తీసుకుని ఓటు వేసే వారికి కూడా ఓటు హక్కు ఉండకూడదన్నాడు.

అలాగే.. విమానం నడిపే పైలట్‌ను దానిలో ప్ర‌యాణించ‌బోయే 300 మంది ప్రయాణికులు ఓట్లు వేసి ఎన్నుకోరు కదా..! అలాగే సమాజాన్ని నడిపే బాధ్యతను పూర్తి అవగాహన ఉన్న నాయకుడి చేతిలో పెట్టాలని అన్నాడు. అంతే తప్ప అందరికి ఓటు హక్కు కల్పించకూడదని అన్నాడు. విజయ్ వ్యాఖ్యలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విజ‌య్ వ్యాఖ్య‌లు నియంతృత్వ ధోర‌ణికి అద్దం ప‌ట్టేలా ఉన్నాయ‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తుంటే.. కొంద‌రు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

Next Story