ఇంట్లో గొడవ పడి బయటకు వచ్చా..
By తోట వంశీ కుమార్ Published on 16 April 2020 10:56 PM ISTకరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసులు. వారి సేవలకు గులాం అయ్యానని యంగ్ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. గురువారం నగర పోలీస్ కమిషన్ అంజనీకుమార్‌తో కలిసి లాక్‌డౌన్ కర్ఫ్యూలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను కలిసి వారికి ఫ్రూట్ జ్యూస్ అందించారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. చాలా దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయని, తన జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. ప్రపంచ యుద్దం సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండేవారని విన్నాను. ప్రస్తుతం మనమందరం కూడా యుద్దమే చేస్తున్నామని తెలిపాడు. డాక్టర్లు, పోలీసులు ఈ యుద్దంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని, వారికి మనం సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నాడు.
మొన్న వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసులతో మాట్లాడేటప్పుడు పబ్లిక్‌లోకి వచ్చి మాట్లాడితే బాగుండేదని కొందరు పోలీసులు సూచించారని.. అందుకే నేడు పబ్లిక్‌లో వచ్చి మాట్లాడుతున్నానని చెప్పాడు. నేను బయటికి వస్తుంటే.. మా అమ్మ నాన్న బయటకు వెళ్లవద్దని చెప్పారు. కానీ, వాళ్లతో గొడవపడి వచ్చానన్నాడు. ఒక్క రోజు బయటికి వస్తేనే మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. అలాంటిది.. పోలీసులు, వారి కుటుంబాలను వదిలి విధులు నిర్వహిస్తున్నారు. అందుకే డాక్టర్లు, పోలీసులకు, వారి కుటుంబాలకు కృతజ్క్షతలు చెబుతున్నాన్నారు.