కొబ్బరి బొండాంలో చికెన్ రైస్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2020 3:40 PM GMT
కొబ్బరి బొండాంలో చికెన్ రైస్‌..

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణిక‌స్తోంది. మ‌హ‌మ్మారి ముప్పుతో చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించాయి. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. సినిమా షూటింగ్‌లు కూడా వాయిదా ప‌డ్డాయి. నిత్యం షూటింగ్‌ల‌తో బిజీగా ఉండే.. మ‌న హీరోలు.. క‌రోనా సెల‌వుల‌ను కుటుంబ స‌భ్యుల‌తో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. తాము లాక్‌డౌన్ టైంలో ఏం ప‌నులు చేస్తున్నామో సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంటున్నారు. తాజాగా.. మంచు విష్ణు ఓ స‌రికొత్త వంటకాన్ని ప్ర‌యోగం చేశాడు.

అదే.. కొబ్బ‌రి బొండాంలో చికెన్ రైస్‌. బొంగులో చికెన్ విన్నాం కానీ.. ఈ బొండాంలో బిర్యానీ ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అంత‌గా ఆలోచించ‌కండి.. ఎందుకంటే.. ఇది అంత‌లా ఎవ‌రికి తెలీదు లెండి. క‌థానాయ‌కుడు మంచు విష్ణుకు వ‌చ్చిన ఆలోచ‌న ఇది. బొండాంలో బిర్యానీ వండితే ఎలా ఉంటుందోన‌ని ఓ సారి ప్ర‌యోగం చేశాడ‌ట‌. అది వర్కవుట్‌ అయిందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. కొబ్బరిబొండాంలో చికెన్‌ రైస్ వింతంగా అనిపిస్తుంది క‌దా..

New Project(6)

మంచు విష్ణు ట్విట్ట‌ర్ ఓ వీడియో పోస్టు చేశాడు. కొత్త‌గా ఏదైన వండాల‌ని ప్ర‌యత్నించాన‌ని, కొబ్బిరి బొండాంలో రైస్‌, చికెన్ పెట్టి వండాన‌న్నాడు. లాక్‌డౌన్ పూర్తి కాగానే చెఫ్‌గా మారి అనేక పేటెంట్‌ల‌ను ఫెల్ చేస్తానంటూ ఆ వీడియో కింద రాసుకొచ్చాడు. ఇక ఆ వీడియోలో కొబ్బ‌రి బొండాంలో వండిన చికెన్ రైస్‌ను విష్ణు తీస్తుండ‌గా.. ప‌క్క‌న మంచు ల‌క్ష్మీ, మోహ‌న్ బాబు, ఆయ‌న స‌తీమ‌ణి ఉన్నారు. మ‌రీ ఆ ప్ర‌యోగం స‌క్సెస్ అయ్యిందో లేదో మంచు విష్ణు చెప్ప‌లేదు కానీ.. సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.Next Story
Share it