వారిద్దరితో విడిపోవ‌డానికి.. అదే కార‌ణం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2020 4:24 PM GMT
వారిద్దరితో విడిపోవ‌డానికి.. అదే కార‌ణం

లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌. ద‌క్షిణాదిలో లేడి ఓరియెండ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్. సాంప్ర‌దాయ బ‌ద్దంగా చీర‌లో క‌నిపించినా.. బికీనీ‌లో అభిమానుల‌కు క‌నువిందు చేసినా ఆమెకే చెల్లింది. ఎలాంటి పాత్ర‌లోనైనా న‌టించిన మెప్పించ‌గ‌ల న‌టి. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తో హీరోల‌కు ధీటుగా వ‌సూళ్లు రాబ‌ట్టి స‌త్తా చాటింది. ఆమెతో సినిమా అంటే.. వ‌సూళ్ల‌కు డోకా ఉండ‌దు. ఆమెతో సినిమా చేయాలంటే.. ఆమె పెట్టె కొన్ని కండీష‌న్ల‌కు త‌ప్ప‌క త‌లొగ్గాల్సిందే. ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా త‌న కండిష‌న్ల‌ను, న‌మ్మ‌కాల‌ను వ‌దిలిపెట్ట‌దు.

రీల్ లైఫ్‌లో ఆమెకు తిరుగులేదు.

కాగా.. రియ‌ల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుగుల‌ను ఎదుర్కొంది. రెండు సార్లు ప్రేమ వ్య‌వ‌హారాలు బెడిసికొట్టాయి. శింబు, ప్ర‌భుదేవాతో ల‌వ్ ఫెయిల్యూర్స్ ఆమెలో చాలా మార్పులు తీసుకొచ్చాయి. తాజాగా ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమ‌లో ఉంది.

Nayanthara talks about her Love failures

కాగా.. ఇన్నాళ్లు.. త‌న ప్రేమ వ్య‌వ‌హారాల‌పై స్పందించని నయ‌న్‌.. ఇన్నాళ్లకు తన పాత లవ్‌ ఫెయిల్యూర్స్‌పై స్పందించింది. న‌మ్మ‌కం లేని చోట ప్రేమ నిల‌బ‌డ‌దు. నా జీవితంలో రెండు సార్లు ప్రేమ విఫ‌లం కావ‌డానికి అదేకార‌ణం. న‌మ్మ‌కం లేని చోట క‌లిసుండ‌డం క‌న్నా విడిపోవ‌డమే మంచిద‌ని వారితో నా బంధాన్ని వ‌దులుకున్నాను. అప్పుడు ఎంత బాధ‌ప‌డ్డానో ఎవ్వ‌రికి తెలీదు. ఆ బాధ కేవ‌లం నాకు మాత్ర‌మే తెలుసు. ఆ స‌మ‌యంలో నేను మాట్లాడ‌క‌పోయే స‌రికి ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు వారు రాసుకున్నారు. అవ‌న్ని చూసిన నేను వాటిపై ఏమీ మాట్లాడ‌లేదు. ఆ బాధ నుంచి బ‌య‌టికి రావ‌డానికి నాకు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. సినిమాల వల్లే నేను తిరిగి కోలుకున్నాను. అభిమానులు ఎల్ల‌ప్పుడూ నా వెంటే ఉంటూ నాకు అండ‌గా నిలిచారు. నేను ఒక్క‌టే నిర్ణ‌యించుకున్న జీవితంలో ఏం జ‌రిగినా స‌రే.. ఎప్ప‌టికి సినిమాల‌ను వ‌ద‌ల‌కూడ‌ద‌ని అని న‌య‌న‌తార చెప్పుకొచ్చింది.

Next Story
Share it