RRR.. ర‌న్ టైం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2020 3:03 PM GMT
RRR.. ర‌న్ టైం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ద‌ర్శ‌క దీరుడు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్‌'. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టిస్తుండ‌డంతో ఈ చిత్రం పై అభిమానుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. ఇక అభిమానుల అంచ‌నాల‌ను మించి ఉండేలా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నార‌ట‌. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది.

తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ చిత్ర నిడివి మూడు గంట‌లు పైగా ఉంటుంద‌ట‌. ఇద్ద‌రు స్టార్ హీరోలు ఉండ‌డం, బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటి నటులు న‌టిస్తుండ‌డం వ‌ల్ల ఈ చిత్ర ర‌న్‌టైం మూడు గంట‌ల‌కు పైగా ఉంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. బాహుబ‌లి చిత్రం రెండు భాగాలు కూడా మూడు గంట‌ల్లోపు ఉండేలా చూస్తుకున్నాడు రాజ‌మౌళి. మొద‌ట 'బాహుబ‌లి' చిత్రాన్ని ఒకే సినిమాగా విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నా.. సినిమా నిడివి ఎక్కువ కావ‌డంతో రెండు భాగాలుగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌క‌దీరుడు.

ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ లాంటి యాక్ట‌ర్స్ ఉండ‌డంతో పాటు క‌థ ఉత్కంఠ ఉండ‌డంతో ప్రేక్ష‌కుల‌ను ఈజీగా మూడు గంట‌లు కూర్బోబెట్ట‌వ‌చ్చు అని బావిస్తున్నాడ‌ట జ‌క్క‌న‌. బాహుబ‌లి చిత్రాన్ని మొద‌ట ఇలానే అనుకున్నా.. త‌రువాత రెండు భాగాలుగా తెర‌కెక్కించిన జ‌క్క‌న‌.. 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని కూడా రెండు బాగాలుగా తెర‌కెక్కిస్తాడేమోన‌ని అనుకుంటున్నారు ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు. ఇందులో ఎంత వ‌ర‌కు నిజముందో మ‌రికొన్ని రోజులు ఆగితేకాని తెలియ‌దు.

ఇటీవ‌ల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చరణ్ తాలూకా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోతో అభిమానుల్లో ఈ చిత్రం పై అంచ‌నాలు భారీగా పెరిగాయి. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కాగా.. క‌రోనా ముప్పుతో ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో అనుకున్న స‌మ‌యానికి ఈ చిత్రం విడుద‌ల కావ‌డం క‌ష్టమ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Next Story