కుమారుడికి మ‌హేష్ పేరు పెట్టిన ద‌ర్శ‌కుడు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2020 8:01 AM GMT
కుమారుడికి మ‌హేష్ పేరు పెట్టిన ద‌ర్శ‌కుడు..

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన చిత్రం "స‌రిలేరు నీకెవ్వ‌రు". ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ చిత్రం. ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీంతో రికార్డు క‌లెక్ష‌న్ల‌తో బంప‌ర్ హిట్ గా నిలిచింది. మ‌హేష్, అనిల్ రావిపూడి కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెల‌కొల్పింది. వ‌రుస‌గా రెండు చిత్రాలు('ఎఫ్‌ 2', 'స‌రిలేరు నీకెవ్వ‌రు') వంద కోట్ల క్ల‌బ్ లో చేర‌డంతో ద‌ర్శ‌కుడిగా అనిల్ మ‌రో మెట్టు పైకి ఎక్కాడు.

కాగా.. ఈ సినిమా ప్ర‌మోష‌న్ స‌మ‌యంలో ప్రీరిలీజ్ ఈ వెంట్ జ‌రుగుతుండ‌గా.. అనిల్ రావిపూడి దంప‌తుల‌కు కొడుకు పుట్టాడు. దానిని అనిల్ శుభ‌సూకంగా బావించాడు. తాజాగా త‌న కుమారుడికి పేరు పెట్టారు అనిల్. సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మహేష్ పాత్ర పేరును తన కుమారుడికి పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ చిత్రంలో మహేష్ పాత్ర పేరు అజయ్ కృష్ణ. తన కొడుకుకు అజయ్ సూర్యన్ష్ అని పెట్టినట్లుగా పేర్కొన్నాడు.

'ఎఫ్‌ 2' విజ‌యం త‌రువాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. అనిల్ రావిపూడికి పిలిచి మ‌రీ సినిమా అవ‌కాశాన్ని ఇచ్చాడు. దీంతో మ‌హేష్ కు కృత‌జ్ఞ‌త‌గానే ఆ పేరు పెట్టుకున్న‌ట్లు చెప్పాడు. కాగా ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడు 'ఎఫ్ 3' చిత్ర స‌న్నాహాల్లో ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ప‌రిస్థితులు అన్ని అనుకూలించగానే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడ‌ట‌. 'ఎఫ్ 2' చిత్రానికి మించిన కామెడీతో సూప‌ర్ ట్విస్టుల‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది.

Next Story
Share it