బుల్లితెరపై మ‌రోసారి సంద‌డి చేయ‌నున్న ఎన్టీఆర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2020 1:30 PM GMT
బుల్లితెరపై మ‌రోసారి సంద‌డి చేయ‌నున్న ఎన్టీఆర్‌

క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డిలో భాగంగా దేశ వ్యాప్త లాక్‌డౌన్ ను విధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌జలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బ‌య‌టికి వెళ్లే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో సీరియ‌ల్స్‌, సినిమా ఘాటింగ్‌లు నిలిచిపోయాయి. దీంతో టీవీల్లో తాజా ప్రోగ్రామ్స్ ప్ర‌సారం చేయ‌డంలో ఇబ్బందులు త‌లెత్తాయి. దీంతో గ‌తంలో విశేషంగా అల‌రించిన ప్రొగ్రామ్‌ల‌ను మ‌ళ్లీ ప్ర‌సారం చేస్తున్నారు.

ఒక ఇంట్లో 15 మంది సెల‌బ్రెటీలు 100 రోజులు పాటు ఉండ‌డం వంటి కాన్సెప్ట్ తో వచ్చిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. విదేశాల్లో ఈ షోకు విశేష ఆద‌ర‌ణ ఉన్న మ‌న తెలుగు ప్ర‌జ‌ల‌కు ఈ షో చాలా కొత్త‌. దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లిన న‌టుడు ఎన్టీఆర్. ఎప్పుడు సినిమాల‌తో బిజీగా ఉండే ఎన్టీఆర్ 2017 లో బిగ్‌బాస్ సీజ‌న్ 1కి వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి.. జనాల‌కు ఈ షోను ప‌రిచ‌యం చేశారు. త‌న మాట‌లు, స‌మ‌య‌స్పూర్తితో ఎన్టీఆర్ ఈ షోకే వ‌న్నెతెచ్చాడు అన‌డంలో అతిశ‌యోక్తి కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నాలుగో సీజ‌న్ వైపు అడుగులు వేస్తోంది.

మొద‌టి సీజ‌న్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. రెండో సీజ‌న్ లో నాని, మూడో సీజ‌న్ లో అక్కినేని నాగార్జున లు హోస్టులుగా అల‌రించారు. అయితే.. ఎన్టీఆర్ చేసిన రేంజ్‌లో వీరు అల‌రించ‌లేక‌పోయారు అనేది స‌గ‌టు అభిమాని భావ‌న‌.

లాక్‌డౌన్ ప్ర‌భావంతో.. నేటి నుంచి బిగ్‌బాస్ సీజ‌న్ 1ను పునఃప్ర‌సారం చేయ‌నున్నారు. ఇప్ప‌టికే బిగ్‌బాస్ 3 ని పునఃప్ర‌సారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ అభిమానులు త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. NTRsBiggBossReTelecast అనే హ్యాష్ ట్యాగ్ ట్వీట్ట‌ర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

Next Story
Share it