థ్యాంక్ త‌మ‌న్‌.. 'జీవితాంతం ఈ ట్వీట్ దాచుకుంటా'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 April 2020 2:31 PM GMT
థ్యాంక్ త‌మ‌న్‌.. జీవితాంతం ఈ ట్వీట్ దాచుకుంటా

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం 'అల.. వైకుంఠ‌పురంలో..' సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్దే హీరోయిన్ న‌టించిన ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.

చిత్ర విజ‌యంలో సంగీతం కూడా కీల‌క పాత్ర పోషింది. కాగా ప్ర‌స్తుతం ఈ చిత్ర ఆల్బ‌మ్ 1.13 బిలియ‌న్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ నేప‌థ్యంలో బ‌న్ని ట్విట్ట‌ర్ ద్వారా త‌మ‌న్‌ను అభినందించాడు. 'మై డియ‌ర్ త‌మ‌న్‌. నువ్వు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నందుకు నేనెంతో గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఈ చిత్ర ప్రారంభానికి ముందు బిలియ‌న్ వ్యూస్ ఉండేలా ఆల్బ‌మ్ కావాల‌ని నీతో చెప్పాను. దానికి నువ్వు స‌రే చెప్పావు.. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నావు. ఇప్ప‌టికి 1.13 బిలియ‌న్ మంది ఈ పాట‌ల‌ను విన్నారు. థ్యాంక్స్ త‌మ‌న్' అని బ‌న్నీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు త‌మ‌న్ స్పందించాడు. 'ఈ ట్వీట్‌ను నా జీవితాంతం దాచుకుంటాను బ్ర‌ద‌ర్. దీనికి కార‌ణం నువ్వ‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ నాపై చూపించిన ప్రేమ‌, న‌మ్మ‌కం వ‌ల్లే సాధ్య‌మైంద‌ని' అంటూ రిప్లే ఇచ్చాడు.Next Story
Share it