Fact Check : డ్రోన్ ద్వారా వస్తువుల సరఫరా.. రియాలిటీనేనా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Oct 2020 12:40 PM ISTలాక్ డౌన్ సమయాల్లో చాలా మంది బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో డోర్ డెలివరీ ఎక్కువగా చేయించుకుంటూ ఉన్నారు. డ్రోన్ ల ద్వారా సరుకులు డెలివరీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే చాలా సంస్థలు వెల్లడించాయి. అవి ఎంత వరకూ నిజమో తెలియడం లేదు.
Drone delivery service in Lagos... What do you think? pic.twitter.com/oQ1VwoKKLg
— Funny🃏Banter (@iTv001) August 27, 2020
తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ డ్రోన్ బాల్కనీ లోకి వచ్చింది. అది తీసుకుని వచ్చిన వస్తువులను అక్కడ పెట్టమని సూచించగా.. అతడు చెప్పినట్లే చేసింది. ఆఖర్లో ఓ స్వైపింగ్ మెషీన్ ను ముందు పెట్టగా.. అక్కడ ఉన్న ఓ వ్యక్తి స్వైప్ చేశాడు.. వెంటనే వచ్చిన దారిలో ఆ డ్రోన్ వెళ్ళిపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. డ్రోన్ ద్వారా వస్తువుల సరఫరా మొదలైందని చెబుతూ ఉన్నారు. లాగోస్ లో ఇలా డ్రోన్ ద్వారా వస్తువుల సరఫరా చేస్తున్నారని పలువురు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
“Drone delivery service in Lagos… What do you think?” అంటూ వీడియోను పోస్టు చేస్తున్నారు. చాలా మంది ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇలాంటి సర్వీసులు తమ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వస్తే ఎంత బాగుంటుందో కదా అని తమ అభిప్రాయాలను నెటిజన్లు బయటపెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
నిజమైన డ్రోన్ ఇలా సరుకులు సరఫరా చేస్తోంది అంటూ వైరల్ అవుతున్న వీడియో 'పచ్చి అబద్ధం'.
ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Uche Anisiuba ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోను మొదట పోస్టు చేశారు. నైజీరియాకు చెందిన కంటెంట్ ప్రొడక్షన్ కంపెనీ అయిన క్వాడ్రన్ స్టూడియోస్ కు కో-ఫౌండర్ ఈయన.
“So I ran out of Indomie yesterday, needed to make a quick restock, never knew we had a drone delivery service in Lagos. #visualeffects #redshift3d #nollywood #africarising #africatech #nigerian #3Danimation #motiondesign @IndomieNigeria @myaccessbank @AccelerateTV @burnaboy అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను బట్టి ఆ వీడియోను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తీర్చిదిద్దినదని స్పష్టమవుతోంది.
ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అయిపోయింది. ఈ వీడియోపై పలు డిస్కషన్లు జరిగాయి. దీంతో తాను స్పెషల్ ఎఫెక్ట్స్ ను ఉపయోగించి ఈ వీడియోను తయారు చేశానని అతడు అందుకు సంబంధించి మరో వీడియోను అప్లోడ్ చేశాడు.
Artfrocentric.com అనే యూట్యూబ్ ఛానల్ లో అనిసుభా తాను ఈ యానిమేషన్ వీడియోను ఎలా రూపొందించానో వివరించాడు. ప్రజలు నిజమేనని నమ్మేస్తారని తాను అసలు నమ్మడం లేదని చెప్పుకొచ్చాడు అతడు.
కాబట్టి నైజీరియాలోని లాగోస్ లో నూడుల్స్ బాక్సులను డ్రోన్ ల ద్వారా సరఫరా చేస్తున్నారన్నది పోస్టులు 'పచ్చి అబద్ధం'. ఈ వీడియోను డిజిటల్ గా ఉచే అనిసుభా అనే వ్యక్తి రూపొందించాడు.