నాన్న కోసం.. దిష్టిబొమ్మను పెళ్లిచేసుకున్న యువకుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2020 7:18 AM GMT
నాన్న కోసం.. దిష్టిబొమ్మను పెళ్లిచేసుకున్న యువకుడు

పెళ్లి అంటే నూరేళ్ల పంట. పెళ్లి గురించి కాబోయే వధూ వరులు ఎన్నో కలలు కంటుంటారు. చేసుకోబోయేవారు ఇలా ఉండాలని, అలా ఉండాలని ఎన్నో ఊహించుకుంటారు. అయితే.. ఓ యువకుడు మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. పెళ్లికి బందువులంతా వచ్చారు. పెళ్లి తంతూ ప్రారంభమైంది. వరుడు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. అయితే.. పెళ్లి కూతురు అక్కడ ఎక్కడా కనిపించడం లేదు. వచ్చినవారంతా ఒకరి మొహాలు మరొకరు చేసుకున్నారు. ఇంతలో పెళ్లికూతురిలా తయారు చేసిన ఓ దిష్టిబొమ్మను తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేసరికి పెళ్లికొచ్చినవారంతా షాక్‌ అయ్యారు. ఆ యువకుడు ఆ దిష్టిబొమ్మ మెడలో తాళి కట్టాడు. ఆ యువకుడి పెళ్లి ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ యువడకు దిష్టి బొమ్మను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చూద్దాం..

ప్రయాగ్‌రాజ్‌ సమీపంలోని బైద్పూర్‌ గ్రామానికి చెందిన శివమోహన్‌(90) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడికి తొమ్మిది మంది సంతానం. ఇప్పటికే 8 మంది పిల్లల పెళ్లి చేశాడు. ఇక చిన్న కొడుకు పంచరాజ్‌(32)కు వివాహాం కాలేదు. ఇక తాను ఇక ఎంతకాలం బతుకుతానో అని చిన్న కొడుకు పెళ్లి చేయాలనుకున్నాడు. అయితే.. పంచరాజ్‌కు మానసిక రుగ్మతతో బాదపడుతున్నాడు. దీంతో అతడికి పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

Untitled 4 Copy

బాగా విసిగిపోయాడు శివమోహాన్‌. చివరికి ఓ దిష్టిబొమ్మతో పెళ్లి చేయాలని నిర్ణయించాడు. మొదట్లో దిష్టి బొమ్మతో వివాహాం చేసుకునేందుకు పంచరాజ్‌ అభ్యంతరం తెలిపినా.. తండ్రి బుజ్జగించడంతో పెళ్లికి ఒప్పుకున్నాడు. మాములు పెళ్లి లాగే.. ఈ పెళ్లి జరిపించాడు. పెళ్లికి బంధువలందరిని పిలిచి భోజనాలు పెట్టాడు. ఈ పెళ్లిని చూసిన వారంతా ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా..? ఆశ్చర్యపోతున్నారు.

12

Next Story