నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
By సుభాష్ Published on 30 Jun 2020 9:04 AM ISTభారత ప్రధాని నరేంద్రమోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు మాట్లాడనున్నట్లు ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. అన్‌లాక్ 2కు సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను సైతం జారీ చేసింది.
జులై 31 వరకు పాఠశాలలు, కళాశాలలు, జిమ్‌లు, సినిమా థియేటర్లు మూతపడి ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మరోసారి జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో పెరుగుతుండటంతో ఈ అంశంపైనే ప్రసంగించనున్నారు. అలాగే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని కీలక సూచనలు చేయనున్నారు.
Next Story