దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు కాలరాస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే పనిలో పడ్డాయి ఆయా రాష్ట్రాలు. ఇక మహారాష్ట్రలో కూడా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉంది. ఇక తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనా కట్టడి కోసం జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతేకాదు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది మహా సర్కార్‌.

కాగా,  దేశ వ్యాప్తంగా మొత్తం 5.48 కరోనా కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 1,64,625 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 7,429 ఉండగా, 86,575 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 70,625 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇలా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయి.

 

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.