సత్యమేవ జయతే.. నిజం గెలుస్తుంది.. వీడియోలో ఏడ్చేస్తూ మాట్లాడిన రియా చక్రవర్తి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 July 2020 10:30 PM IST
సత్యమేవ జయతే.. నిజం గెలుస్తుంది.. వీడియోలో ఏడ్చేస్తూ మాట్లాడిన రియా చక్రవర్తి..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి రియా చక్రవర్తి కారణమంటూ సుశాంత్ తండ్రి ఆరోపించిన సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో తన మీద వస్తున్న వార్తల గురించి రియా చక్రవర్తి స్పందించింది. ఆమె లాయర్లు వీడియోను అప్లోడ్ చేశారు. ఏడుస్తూ మాట్లాడింది రియా చక్రవర్తి.



దేవుడిపై అలాగే న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని.. తనకు న్యాయం జరుగుతుందని తెలిపింది. ఎలక్ట్రానిక్ మీడియాలో తన గురించి చాలా భయంకరమైన విషయాలు చెబుతున్నప్పటికీ.. తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను అన్నారు. వీటిపై తన లాయర్స్ సలహా మేరకే స్పందిస్తానన్నారు రియా. చివర్లో సత్యమేవ జయతే.. నిజం గెలుస్తుంది అని తెలిపింది రియా.

సుశాంత్‌ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించిన పోలీసులకు కీలక వివరాలు లభ్యమయ్యాయి. గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి విమాన టికెట్లు, హోటల్‌ ఖర్చులను సుశాంత్‌ భరించాడని.. రియా సోదరుడి ఖర్చులు కూడా సుశాంత్‌ చూసుకున్నాడని బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లో తేలింది.

సుశాంత్ తండ్రి పెట్టిన కేసును ముంబైకి బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరింది రియా. ఆమె మాట్లాడుతూ.. నాతో పాటు మరో ఆరుగురు కలిసి సుశాంత్ ని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించినట్లు చేసిన అభియోగం పూర్తి అవాస్తవమని తెలిపింది. లేనిపోని అభియోగాలు మోపడంతో నాకు ప్రాణహాని కలిగింది.. నాకు తెలియని వారు రేప్ చేస్తానంటూ , చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు అని చెప్పుకొచ్చింది రియా.

హీరోగా త‌న‌దైన న‌ట‌న‌తో బాలీవుడ్‌లో అన‌తికాలంలోనే గుర్తింపుపొందిన‌ సుశాంత్ జూన్ 14వతేదీన ముంబైలోని బాంద్రా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అప్ప‌టి నుండి సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌పై అనుమానాలు ఉన్నాయంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

Next Story