Fact Check : టైమ్ మేగజైన్ పై ఉన్నది ట్రంప్ ఫోటోయేనా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2020 3:35 AM GMTఅమెరికా ప్రజలు ట్రంప్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని ప్రస్తుతం అక్కడ చోటుచేసుకుంటున్న నిరసనల ద్వారా మనకు అర్థమవుతుంది. కొద్దిరోజుల కిందట నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతుల్లో మరణించడంతో అమెరికాలోని ప్రజలంతా 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' అంటూ పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు. మరి కొద్దిరోజుల్లో అమెరికాలో ఎన్నికలు జరగనుండడంతో ప్రతి ఒక్కరూ ట్రంప్ ప్రభుత్వంపై ఈ ఘటనలు తీవ్ర ప్రభావం చూపనుంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. ట్రంప్ ను హిట్లర్ గా చిత్రీకరిస్తూ టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటోను పబ్లిష్ చేశారని పలువురు ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టారు. కేవలం ఇంగ్లీష్ లోనే కాకుండా.. మిగిలిన భాషలకు చెందిన వాళ్ళు కూడా దీన్ని షేర్ చేయడం మొదలు పెట్టారు.
What a cover! @TIME pic.twitter.com/O9IaVRrQo6
— Rahul Meena (@SRahulM) June 1, 2020
Está rulando demasiado esta portada de TIME.
No sé, Rick, ¿tú qué dices...? pic.twitter.com/fa3tWyFIfO
— Javier Salas (@javisalas) May 30, 2020
#timemagazine అంటూ ట్విట్టర్ లో సెర్చ్ చేయగా ఎంత మంది ఈ కవర్ పేజీని ట్వీట్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
నిజ నిర్ధారణ:
ట్రంప్ ను హిట్లర్ గా చిత్రీకరిస్తూ టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటోను పబ్లిష్ చేశారన్న వార్త పచ్చి అబద్ధం.
https://time.com/magazine/ లో టైమ్ మ్యాగజైన్ కు సంబంధించిన లేటెస్ట్ కవర్ పేజీలను చూడొచ్చు. అందులో ఎక్కడ కూడా ఈ కవర్ పేజీ కనిపించలేదు. ఇది ఫేక్ అని టైమ్స్ సంస్థ కూడా స్పష్టం చేసింది. ఫేక్ టైమ్ మ్యాగజైన్ ను కనుక్కోవచ్చో అందుకు సంబంధించిన టిప్స్ ను టైమ్ మ్యాగజైన్ అందించింది. ‘How to Spot a Fake TIME Cover' అని సెర్చ్ చేస్తే టైమ్ మ్యాగజైన్ నిజమా కాదా అన్నది తెలుసుకోవచ్చు.
ముఖ్యంగా సంస్థ లోగో ద్వారా కూడా అది నిజమైన లోగోనో కాదో గుర్తించవచ్చు. తప్పుడు కవర్ పేజీలపై లోగో వేరే విధంగా ఉంటుందని.. పేజీ బోర్డర్ లో కూడా చాలా తేడాలను గమనించవచ్చు. కవర్ పేజీలను టైమ్ మేగజైన్ కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ లో చూడొచ్చు.. ఎప్పటికప్పుడు ఫేక్ కవర్ పేజీలను సంస్థ వెరిఫై చేస్తూ ఉంటుంది.
https://time.com/4836933/fake-
టైమ్ వాల్ట్ లో గతంలో వచ్చిన మేగజైన్ కవర్లను చూడొచ్చు.
https://time.com/vault/year/
వీటిలో ఎక్కడ కూడా ఈ కవర్ పేజీ వచ్చిన దాఖలాలు లేవు.
ఈ వైరల్ ఫోటోను తీక్షణంగా గమనించగా.. ఆర్టిస్ట్ సిగ్నేచర్ ను గమనించవచ్చు. Osekoer అన్న సంతకం ఈ ఆర్ట్ లో ఉంది. ఈ పేరును గూగుల్ లో సెర్చ్ చేయగా చాలా రిజల్ట్స్ వచ్చాయి.. అందులో O-sekoer, బెల్జియన్ కార్టూనిస్ట్ ఒకరు ఉన్నారు.
cartoongallery.eu ప్రకారం లూక్ డెస్చీమేకర్ అక్టోబర్ 2న 1955లో బెల్జియం లోని కుర్నాలో జన్మించాడు. O-SEKOER అన్నది ఆయన మరో పేరు.. ఈ పదం అర్థం 'సహాయం' అని..
http://www.cartoongallery.eu/
ఆయనకు సంబంధించిన బ్లాగ్ కూడా ఉంది. http://o-sekoer.blogspot.com/ ఇందులో ఆయన ఆర్ట్ వర్క్ మొత్తాన్ని చూడొచ్చు. ఈ బ్లాగ్ లో ప్రస్తుతం వైరల్ అవుతున్న ట్రంప్ ఫోటోను చూడొచ్చు. @osekoer అనే ట్విట్టర్ అకౌంట్ లో ఆగస్టు 9, 2016న తన ఆర్ట్ వర్క్ ను పోస్టు చేశారు.
@NewYorkTimes11 racism vs trump pic.twitter.com/HBSeSH6MoU
— luc descheemaeker (@osekoer) August 9, 2016
సోషల్ మీడియాలో ఈ ఆర్ట్ వర్క్ కు సంబంధించిన చాలా వెర్షన్స్ ను చూడవచ్చు. టైమ్ మ్యాగజైన్ కు చెందిన కవర్ పేజీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
లూక్ డెస్చీమేకర్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. ఇది నిజమైన టైమ్ మేగజైన్ కవర్ పేజీ అనుకుని పలువురు షేర్ చేయడం మొదలుపెట్టారు.
ట్రంప్ ను హిట్లర్ గా చిత్రీకరిస్తూ టైమ్ మ్యాగజైన్ కవర్ ఫోటోను పబ్లిష్ చేశారన్న వార్త పచ్చి అబద్ధం. ఇది బెల్జియన్ కార్టూనిస్ట్ 2016లో గీసిన కార్టూన్.