భారత్‌ పర్యటనలో సంచలన ప్రకటన చేసిన 'ట్రంప్‌'

By సుభాష్  Published on  24 Feb 2020 10:27 AM GMT
భారత్‌ పర్యటనలో సంచలన ప్రకటన చేసిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన కొనసాగుతోంది. గుజరాత్‌లోని మోతెరా వేదికగా సాగిన ట్రంప్‌ నమస్తే కార్యక్రమంలో ట్రంప్‌ భారత ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసల వర్షం కురిపించారు. నమస్తే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్‌.. మోదీ దేశం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం ఓ సంచలన ప్రకటన చేశారు. భారత్‌ - అమెరికాలు 3 బిలియన్‌ డాలర్ల రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేస్తానని ట్రంప్‌ ప్రకటించారు. దీంతో సభ ప్రాంగణం చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

మోదీ గొప్ప స్నేహితుడు

నరేంద్రమోదీ గొప్ప స్నేహితుడు అంటూ అమెరికా భారత్‌ను అభిమానిస్తుందని ట్రంప్‌ చెప్పారు. భారత్‌, అమెరికా ఎప్పటికీ నమ్మదగ్గ మిత్రులు.. లక్ష మందికిపైగా ఇక్కడికి రావడం విశేషమని, భారత్‌ అతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పుకొచ్చారు. మా హృదయాల్లో ఎప్పటికి నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. ఓ చాయ్‌ వాలా ప్రధానిగా ఎదిగిన తీరు ఎంతో అద్భుతమని, ఇలాంటి విశాల దేశాన్ని మోదీ అద్భుతంగా నడిపించడం గర్వించదగ్గ విషయమన్నారు. అత్యంత విజయవంతంమైన ప్రధానుల్లో మోదీ ఒకరి చెప్పారు. అయితే భారతీయులు ఏదైనా సాధించగలరనే దానికి మోదీ నిదర్శనమని అన్నారు.

భారత్‌ ఆర్థిక ప్రబల శక్తిగా ఎదిగింది. భారతదేశం ఆర్థిక ప్రబల శక్తిగా ఎదిగిందని, దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చిందని, 12 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉపయోగించుకుంటున్నారని అన్నారు.

సచిన్‌, విరాట్‌కో హ్లీలను కొనియాడిన ట్రంప్‌

ప్రపంచ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించి ఎంతో సత్తాచాటిన క్రికెట్‌ దిగ్గజాలైన సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లీలను ట్రంప్‌ కొనియాడారు. వారు పుట్టినిల్లు భారతేనని ప్రశంసించారు. భవిష్యత్‌లో ఇండియా అద్భుత శక్తిగా ఎదిగే అవకాశం ఉందన్నారు. ఇంత భారీ ప్రజాస్వామ్య దేశాన్ని ప్రధాని మోదీ శాంతియుతంగా ముందుకెళ్తున్నారన్నారు.

Next Story