బిగ్ బ్రేకింగ్: కేంద్రం సంచలన నిర్ణయం.. రైళ్లన్నీ రద్దు.. ఎప్పటి వరకు అంటే..
By సుభాష్ Published on 22 March 2020 1:51 PM ISTకరోనా వైరస్ కారణంగా ప్రపంచం వణికిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా భారత్‌లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 350కి చేరువలో ఉంది. ఇక కరోనా మరణాలను చూస్తే ఆదివారం ఒకే రోజు ఇద్దరు మృతి చెందారు. శనివారం వరకు కరోనా మృతుల సంఖ్య 4కు మాత్రమే ఉండగా, ఇప్పుడా సంఖ్య 6కు చేరుకుంది. దీంతో ప్రజలు భాయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 22కు చేరుకుంది. గుంటూరుకు చెందిన యువకుడు లండన్ నుంచి హైదరాబాద్‌కు రావడంతో అధికారులు పరీక్షించి కరోనా ఉన్నట్లు గుర్తించారు.
ఇకపోతే కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31వ తేదీ వరకు దేశంలో రైళ్లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గుడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లన్నీ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తాయని తెలిపింది. ఎందుకంటే రైళ్లలో ఇతర రాష్ట్రాల వారు కూడా ప్రయాణం కొనసాగిస్తుండటం వల్ల రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 11వేలకుపైగా చేరింది. దాదాపు మూడు లక్షల వరకు కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్స పొకిత్స పొందుతున్నారు. కరోనా మరణాల్లో ముందుగా చైనా మొదటి స్థానంలో ఉండగా, ఇటలీ రెండో స్థానంలో ఉండేది. ప్రస్తుతం చూస్తుంటే ఇటలీ మొదటి స్థానంలోకి చేరుకోగా, చైనా రెండో స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అధికం కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలతో పాటు, భారత్ కూడా ఎన్నో చర్యలు చేపడుతోంది. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రధాని పిలుపు మేరకు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారు. ఎవ్వరూ కూడా బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు.