బ్రేకింగ్: బ‌స్సులో 37 మంది.. వారంతా దుబాయ్ నుంచి ముంబైకి.. అక్క‌డి నుంచి హైద‌రాబాద్‌కు..

By సుభాష్  Published on  22 March 2020 5:38 AM GMT
బ్రేకింగ్: బ‌స్సులో 37 మంది.. వారంతా దుబాయ్ నుంచి ముంబైకి.. అక్క‌డి నుంచి హైద‌రాబాద్‌కు..

దేశ వ్యాప్తంగా క‌రోనా కల‌క‌లం సృష్టిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైర‌స్ బారిన వేలాదిగా మృత్యువాత ప‌డుతున్నారు. ల‌క్ష‌ల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టికే ఇతే ఇత‌ర‌ దేశాల‌కు విమానాలు, రైళ్లు ర‌ద్దు చేసింది భార‌త ప్ర‌భుత్వం. విదేశాల నుంచి వ‌చ్చేవారిపై ఎయిర్‌పోర్టుల‌లో అధికారులు ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇత‌ర దేశాల నుంచి మ‌న దేశంలో ఎవ్వ‌రిని రానివ్వ‌కుండా అధికారులు క‌ట్ట‌దిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఒక వేళ దేశంలోకి వ‌స్తే స్ర్కీనింగ్ నిర్వ‌హించి, క‌రోనా అనుమానితులుగా క్యారంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూ నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పిలుపుతో దేశ ప్ర‌జ‌లంతా బంద్ పాటిస్తున్నారు. స్వ‌చ్చంధంగా కర్ఫ్యూకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. ఇక తాజాగా ఓ బ‌స్సు తీవ్ర క‌ల‌క‌లం రేపింది. తెల‌గాణ‌ జ‌హీరాబాద్ శివారులోని మాడ్గి అంత‌ర్ రాష్ట్ర చెక్‌పోస్టు ద‌గ్గ‌ర ముంబై నుంచి వ‌స్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సును పోలీసులు అడ్డుకున్నారు. బ‌స్సులో 37 మంది వ‌ర‌కు ఉండ‌గా, వీరంతా దుబాయ్ నుంచి ముంబైకి వ‌చ్చిన‌ట్లు బ‌స్సు డ్రైవ‌ర్ తెలిపాడు. ముంబై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేందుకు ట్రావెల్ బ‌స్సు బుక్ చేసిన ఏజంట్లు, బ‌స్సులో హైద‌రాబాద్‌కు వ‌స్తుండ‌గా, మాడ్గి చెక్‌పోస్టు వ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు.

అయితే బస్సులో వస్తున్నవారంతా ఏపీలోని విజయనగర్‌, శ్రీకాకుళం జిల్లాల వాసులుగా పోలీసులు గుర్తించారు. కాగా, వీరికి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఈ జిల్లాల నుంచి ఉపాధి నిమిత్తం ఖతర్‌కు వలస వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌రిహ‌ద్దును దాటి రావ‌ద్ద‌ని పోలీసులు హెచ్చ‌రించారు. ఇంత మంది దుబాయ్ నుంచి ముంబైకి, అక్క‌డి నుంచి బ‌స్సులో హైద‌రాబాద్‌కు వ‌స్తుండ‌టంతో తీవ్ర భ‌యాందోళ‌న నెల‌కొంది.

Next Story