న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  1 July 2020 10:31 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

కరోనా హెల్త్‌ బులిటెన్‌లో అరకొర సమాచారం.. తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం

జీవించే హక్కును కాలరాసే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తెలంగాణ కరోనా హెల్త్‌ బులిటెన్‌లలో అరకొర సమాచారంపై మరోసారి ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధర్మాసం అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కంటైన్‌మెంట్‌ విధానమేంటో తెలుపాలని ఆదేశాలు జారీ చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మీ భద్రతకు మేం గ్యారంటీ ఇస్తున్నాం: టిక్‌టాక్‌ సీఈవో

భారత్‌లో టిక్‌టాక్‌ ఉద్యోగుల భద్రతకు పూర్తిస్థాయిలో హామీ ఇస్తున్నామని టిక్‌టాక్‌ సీఈవో కెవిన్‌ మేయర్‌ అన్నారు. తమ లక్ష్యానికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో ఎంతో కృతకృత్యులమయ్యామని చెప్పుకొచ్చారు. భారతీయ చట్టాల కింద డేటా ప్రైవసీ, సెక్యూరిటీ వంటి అంశాలకు తామెంతో ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఈ మేరకు ఇండియాలోని టిక్‌టాక్‌ సిబ్బందికి ఆయన ఓ లేఖ రాశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఒక వైపు ఉగ్రవాదులతో పోరాడుతూ.. మరో వైపు పిల్లాడిని రక్షించిన జవాన్‌

ఇలాంటి హృదయవిదారక ఘటన.. ఇలాంటివి చాలా మట్టుకు సినిమాల్లో చూస్తుంటాము. అప్పటి వరకూ మనవడి చేతిని పట్టుకుని వెళ్తున్న తాత ఉగ్రవాదుల బుల్లెట్లకు కుప్పకూలిపోయాడు. తనతోపాటు వచ్చిన తాత రక్తపు మడుగుల్లో కుప్పకూలిపోవడంతో ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ: కంటైన్‌మెంట్‌ జోన్లలో ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజురోజుకు పెరిగిపోతోంది. లాక్‌డౌన్‌లో తగ్గుముఖంగా ఉన్న కేసులు.. లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. అయితే రాష్ట్రంలో మరో నెల రోజుల పాటు .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మోస్ట్‌ వాల్యూయెబుల్‌ టెస్ట్‌ క్రికెటర్‌గా జడేజా

21వ శతాబ్దంలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అత్యంత విలువైన భారత క్రికెటర్ అని విజ్డన్‌ పేర్కొంది. శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ తరువాత రెండో అత్యంత విలువైన ఆటగాడు జడేజానేనని తెలిపింది. 31ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ బంతితో పాటు బ్యాటింగ్‌ ఫీల్డింగ్‌లో విశేషంగా రాణించాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, మిస్టర్‌ కూల్‌ దోనీని కాదని మోస్ట్‌ వాల్యూయెబుల్‌ టెస్ట్‌ క్రికెటర్‌గా జడేజా ఎంపికవడం విశేషం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘ఒక దేశం – ఒక రేషన్’‌ ప్ర‌యోజ‌న‌మిదే..

కేంద్ర ప్రభుత్వం వ‌న్ నేష‌న్ – వ‌న్‌ రేషన్ కార్డు విధానం తెరపైకి తెచ్చింది. దీని ప్రయోజనం ఏమిటంటే.. తమ గ్రామాన్ని విడిచిపెట్టి ఎవ‌రైతే.. ఉపాధి లేదా ఇతర అవసరాలకు వేరే ప్రాంతాలకు వెళ్ళే పేద వ‌ల‌స‌ కార్మికులు అక్కడ కూడా తమ రేషన్ పొం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జూన్‌లో నాలుగు లక్షల కేసులు.. 12వేల మంది మృతి

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,653 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 507 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు 5,85,493 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

క్యాబ్ డ్రైవర్ల జీవితాలతో ఆడుకుంటున్న కరోనా

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య 6 లక్షల దిశగా దూసుకెళ్తుంది. రోజులు గడిచే కొద్దీ వేలల్లో కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా పుట్టినిల్లైన చైనా లో కూడా ఇన్ని కేసులు, మరణాలు లేవు. కానీ చైనా వెలుపల దేశాలన్నీ కరోనాతో అతలాకుతలమవుతున్నాయి. ప్రజల జీవన వ్యవస్థ అస్తవ్యస్థమయింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హిరణ్యకశ్యప.. రాజీ పడేదే లేదు

హిరణ్యకశ్యప.. మూణ్నాలుగేళ్లుగా చర్చల్లో ఉన్న సినిమా. ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత సినిమా తీసిన గుణశేఖర్.. దాని తర్వాత ‘హిరణ్య కశ్యప’తో అంతకుమించిన రిస్క్ చేయడానికి రెడీ అయ్యాడు. ‘రుద్రమదేవి’లో ఓ కీలక పాత్ర చేసిన రానాను పెట్టి ‘భక్త ప్రహ్లాద’లో హైలైట్‌గా నిలిచిన హిరణ్యకశ్యపుడి పాత్రనే తీసుకుని ‘బాహుబలి’ స్థాయిలో భారీ చిత్రం చేయాలని తలపోశాడు గుణ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

టెస్టు చేసుకోవాలంటే ఏపీలో జగన్ సర్కార్ అలా చేస్తోంది

కొన్ని విషయాల్ని చాలా సీరియస్ గా తీసుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మరికొన్ని విషయాల్లో తనకే మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఈ కారణంతోనే మంచి చేసినప్పటికీ విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం ద్వారా.. ఆయా అంశాల విషయంలో అదే పనిగా వేలెత్తి చూపించుకోవటం కనిపిస్తుంది. ఎక్కడి దాకానో ఎందుకు..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story