ఇలాంటి హృదయవిదారక ఘటన.. ఇలాంటివి చాలా మట్టుకు సినిమాల్లో చూస్తుంటాము. అప్పటి వరకూ మనవడి చేతిని పట్టుకుని వెళ్తున్న తాత ఉగ్రవాదుల బుల్లెట్లకు కుప్పకూలిపోయాడు. తనతోపాటు వచ్చిన తాత రక్తపు మడుగుల్లో కుప్పకూలిపోవడంతో ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న తాతను చూసి ఏడ్చుకుంటూ లేపే ప్రయత్నం చేశాడు. శవం వద్ద కూర్చుని ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు. ప్రతి ఒక్కరిని కదిలించే దృశ్యం జమ్మూకశ్మీర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల అగడాలకు అంతేలేకుండా పోతోంది. భారత ఆర్మీ జవాన్లు ఎన్నిసార్లు బుద్ది చెప్పినా తీరు మారడం లేదు. అయితే ఓ జవాను చేసిన పనికి  ప్రతి ఒక్కరు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే. బుధవారం ఉదయం బారముల్లా జిల్లోలోని సోపోర్‌లో సీఆర్పీఎఫ్‌ పెట్రోలింగ్‌ పార్టీపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్‌ జవాన్‌తో పాటు పౌరుడు మరణించారు. అయితే ఓ తాత, మనవడు కలిసి వెళ్తుండగా,  ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్‌ పెట్రోల్‌ పార్టీపై దాడికి పాల్పడ్డారు. తాతతో పాటు ఓ మూడేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. ఈ దాడిలో  మూడేళ్ల బాలుడి తాత మరణించాడు. దీంతో ఉగ్ర కాల్పులకు బాలుడు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యాడు. ఇక తాత మరణించినా.. బాలుడిని కాపాడేందుకు రక్షణగా నిలిచాడు ఓ జవాను. ఆ బాలున్ని రక్షించి సురక్షితంగా ఇతర ప్రాంతానికి చేరవేశాడు. ఈ ఉగ్రదాడిలో మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఉగ్రవాదులతో పోరాడుతూ బాలున్ని కాపాడిన జవానుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *