వివిధ రాష్ట్రాల హైకోర్టులకు న్యాయమూర్తులు నియమించేందుకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. బుధవారం జరిగిన సుప్రీం కోర్టు కొలీజియం సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఢిల్లీ హైకోర్టుకు కొత్త జడ్జిల నియమించేందుకు సిఫారసు చేయాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అధ్యక్షతన కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జిలు గౌస్‌మీరా మొహిద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, జీ ప్రవీణ్ కుమార్, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా జి.తుహిన్ కుమార్ నియామకానికి కొలీజియం సిఫారసు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు ముగ్గురు జడ్జిలు శైల్ జైన్, మధు జైన్, వినోద్ కుమార్ పేర్లను ఆమోదించింది.