న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  30 Jun 2020 11:45 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

బ్రేకింగ్‌: పేదలకు ఉచితంగా రేషన్‌ ఇస్తాం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉన్నందున నవంబర్‌ వరకు పేదలకు ఉచితంగా రేషన్‌ సరుకులు ఇస్తామని, వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ను ప్రకటించామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కుటుంబంలో ప్రతీ ఒక్కరికి ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం ఇస్తామన్నారు. ఉచిత రేషన్‌ కోసం రూ. 90వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

యాప్స్‌ నిషేధం: భారత్‌ దెబ్బకు స్పందించిన చైనా

చైనాకు సంబంధించిన టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. సరిహద్దులో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు గట్టి షాకివ్వాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్‌ వ్యూహాత్మకంగా చర్యలకు దిగింది. అయితే చైనా యాప్‌లను నిషేధం విధించడంతో చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి ఝావోలిజియన్‌ స్పందించారు. ఈ చర్య తమను తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ప్రకటించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎన్టీఆర్‌ గతం తెలిసి ఏడ్చేశా.. నన్ను హింసించకండి ప్లీజ్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు మద్దుతుగా మాట్లాడినందుకు తనని బెదరిస్తున్నారని నటి పాయల్‌ ఘోష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.దీంతో నెపోటిజంపై ఆగ్రహా జ్వాలలు రగులుతున్నాయి. దీనిపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. ప్రతిభ ఉన్న నటులను పక్కన పెట్టి వారసత్వం నుంచి వచ్చిన నటులకు అవకాశాలు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తాజ్‌ హోటల్‌ను పేల్చేస్తాం.. పాక్‌ నుంచి బెదిరింపులు

ముంబైలోని తాజ్‌ హోటల్‌ను పేల్చివేస్తామని పాకిస్థాన్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్‌ లోపల, బయట భద్రతను పెంచారు. గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ అగంతకుడు ఈ బెదిరింపు కాల్‌ చేసినట్లు, అది పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. పాక్‌లోని కరాచీ స్టాక్‌ ఎక్ఛేంజ్‌పై జరిగిన ఉగ్రదాడిని మీరు చేశారని, ఇప్పుడు తాజ్‌ హోటల్‌పై మళ్లీ దాడి జరుగుతుందని ఫోన్‌లో తెలిపాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వార్నర్‌ను ట్రోల్‌ చేసిన అశ్విన్‌.. ట్వీట్‌ వైరల్

కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా క్రికెటర్లు అంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ లాక్‌డౌన్‌ కాలంలో టిక్‌టాక్‌లో ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్‌, టాలీవుడ్‌ పాటలకు స్టెప్పులు వేశాడు. తన భార్యతో కలిసి డ్యాన్స్‌లు, డైలాగ్‌లతో అలరించాడు. వార్నర్‌ డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. 4.8 మిలియన్ల ఫాలోవర్లతో టిక్‌టాక్‌లో స్టార్‌గా మారాడు వార్నర్‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Fact Check : గల్వాన్ లోయలో మిస్ ఫైర్ అవ్వగానే భారత సైనికులు పారిపోయి వచ్చారా..?

భారత్-చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో చోటుచేసుకున్న గొడవల్లో 21 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన సైనికులు కూడా పెద్ద ఎత్తున మరణించారు. ఆ సంఖ్యను చైనా చెప్పడం లేదు. ఇరు దేశాలు పెద్ద ఎత్తున సైనికులను మొహరిస్తూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో గన్ మిస్ ఫైర్ అయ్యాక భారత జవాన్లు పారిపోయారంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బ్యాన్‌తో ఆగకూడదు.. ట్రాయ్ ను సీన్లోకి దించితేనే చైనాకు చురుకు

చైనాకు చెందిన యాభై తొమ్మిది యాప్స్ ను భారత సర్కారు నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవటం పాత విషయం. బ్యాన్ చేసిన తర్వాత దాని ప్రభావం చైనాకు తాకాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే.. టిక్ టాక్ తో పాటు.. చాలా యాప్స్ కు కోట్లాది డౌన్ లోడ్స్ ఉన్నాయి. తాజాగా విధించిన బ్యాన్ తో కొత్తగా డౌన్ లోడ్ చేసుకునే వారికి మాత్రమే తప్పించి.. ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న వారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘టిక్‌టాక్’‌ నిషేధంసై స్పందించిన ‘టిక్‌టాక్‌ ఇండియా’

దేశంలో చైనాకు సంబంధించిన టిక్‌టాక్‌తో సహా 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ ఇండియా మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది. డేటా ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో భారత చట్టాలకు లోబడి ఉన్నట్లు టిక్‌టాక్‌ ఇండియా పేర్కొంది. భారతీయ యూజర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇతర విదేశీ ప్రభుత్వాలతో షేర్‌ చేసుకోలేదని స్పష్టం చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అన్‌లాక్‌ 2.0: కీలక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

దేశం వ్యాప్తంగా కరోనా వైరస్‌ విరుచుకుపడుతోంది. దీంతో రెండు నెలలపాటు లాక్‌డౌన్ విధించి కట్టడి చేశారు. తర్వాత ఆర్థిక పరిస్థితులు మందగించడంతో లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చారు. ఇక అన్‌లాక్‌ 1.0 ముగిసింది. రేపటి నుంచి అన్‌లాక్‌ 2.0 మొదలు కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం రాత్రి అన్‌లాక్‌ 2.0కు సంబంధించి పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అల్లరోడిని పట్టించుకోండయ్యా.!

తెలుగు ప్రేక్షకులను రాజేంద్ర ప్రసాద్ తర్వాత అంతగా అలరించిన కామెడీ హీరో అల్లరి నరేష్. ‘అల్లరి’తో మొదలుపెట్టి.. తొట్టిగ్యాంగ్, కితకకితలు, సీమశాస్త్రి, బ్లేడు బాబ్జీ, బెండు అప్పారావు, సుడిగాడు లాంటి కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడతను. ఒకప్పుడు అతడిని చూస్తే చాలు నవ్వొచ్చేది. చాలా ఏళ్ల పాటు మినిమం గ్యారెంటీ సినిమాలతో అతను అలరిస్తూ వెళ్లాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story