భారత్-చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో చోటుచేసుకున్న గొడవల్లో 21 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన సైనికులు కూడా పెద్ద ఎత్తున మరణించారు. ఆ సంఖ్యను చైనా చెప్పడం లేదు. ఇరు దేశాలు పెద్ద ఎత్తున సైనికులను మొహరిస్తూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో గన్ మిస్ ఫైర్ అయ్యాక భారత జవాన్లు పారిపోయారంటూ ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గల్వాన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన అని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియోను వైరల్ చేస్తున్నారు. భారత్-చైనాల మధ్య  “current situation” అంటూ వీడియోను యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు.

ట్విట్టర్ యూజర్ ఇమార్క్ దోయా ఈ వీడియోను ట్వీట్ చేశారు.
“You have seen that the Indian Army is very brave in Bollywood movies. But this is the reality of Indian army. Tell me guys, can this army fight against Nepal Army (sic).”
భారత ఆర్మీ బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే పవర్ ఫుల్ అని.. రియాలిటీలో భారత ఆర్మీ ఇలాగే ఉంటుంది. కనీసం నేపాల్ ఆర్మీతో అయినా భారత్ పోరాడగలదా అని ఆ ట్వీట్ లో రాసుకుని వచ్చారు.


నిజ నిర్ధారణ:

న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియోను Riffat Wani అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేసింది. ఈ వీడియోనే ఇమార్క్ దోయా ట్వీట్ చేశారు.

ఈ వీడియో ఇంటర్నెట్ లో 2018 నుండి వైరల్ అవుతోంది. Justice for Lieutenant Colonel Retired Habib Zahir అనే ఫేస్ బుక్ పేజీలో నవంబర్ 10, 2018న అప్లోడ్ చేశారు.

Bravery Archives of Indian Army

Posted by Justice for Lieutenant Colonel Retired Habib Zahir on Saturday, November 10, 2018

Carl Gustaf recoilless gun తో భారత ఆర్మీ ట్రైనింగ్ చేస్తున్న సమయంలో ఓ గన్ మిస్ ఫైర్ అయ్యిందని చైనీస్ రిపోర్ట్ లో ఉంది. సరికొత్త ఆయుధాలను వాడే సమయంలో ఓ తుపాకీ మిస్ ఫైర్ అయిందని రాసుకొచ్చింది. భారత ఆర్మీకి చెందిన ఉన్నత విభాగానికి   చెందిన సైనిక సిబ్బంది మాత్రమే ఈ ఆయుధాలను వాడుతూ ఉంటాయి. ట్రైనింగ్ లో భాగంగా ఆ గన్ లో అయినా సమస్యలు తలెత్తి ఉండొచ్చు లేదా సైనికులు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు అని సదరు మీడియా సంస్థ రాసుకుని వచ్చింది. ఉన్నట్లుండి ఆ గన్ మిస్ ఫైర్ అవ్వడంతో పేలుడు నుండి సైనికులు తప్పించుకోడానికి అక్కడి నుండి పరిగెత్తారు.

Ch1

ఈ వీడియోకు గల్వాన్ లోయలో చోటుచేసుకుంటున్న ఘటనలకు ఎటువంటి సంబంధం లేదు. ట్రైనింగ్ సమయంలో జరిగిన పొరపాటు కారణంగా అక్కడ సైనికులు పరిగెత్తారు. ఈ వీడియో మూలం ఎక్కడి నుండి లభించిందో తెలియరాలేదు.

గల్వాన్ లోయలో మిస్ ఫైర్ అవ్వగానే భారత సైనికులు పారిపోయి వచ్చారన్నది అబద్ధం. ఈ వీడియో 2018 నుండి సామాజిక మాధ్యమాల్లో ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.