న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 6 Oct 2020 12:18 PM GMT1.మరో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఒడిశా నుంచి దక్షిణ కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, అక్టోబర్ 9వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నదని, ఈ కారణాలతో తెలంగాణకు వర్షసూచన కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2.హత్రాస్ ఘటన: అందుకే యువతి శవాన్ని అర్థరాత్రి దహనం చేశాం: యూపీ ప్రభుత్వం
ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యాచారాల కేసుల్లో యూపీ మొదటి స్థానంలో ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కామాంధుల అగడాలకు ఏ మాత్రం హద్దు.. అదుపు లేకుండా పోతోంది. అయితే రాష్ట్రంలో హత్రాస్‌లో ఓ యువతిపై నలుగురు అత్యాచారం జరపగా, ఆమె ఆస్పత్రిలో చికిత్స ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3.తెలంగాణ ఎంసెట్ -2020 ఫలితాలు విడుదల
తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం జేఎన్టీయూ క్యాంపస్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు , మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం నాలుగు రోజుల పాటు ఆన్‌లైన్ ద్వారా అధికారులు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4.15 నుంచి తెరుచుకోనున్న ‘సినిమా థియేటర్లు’.. మార్గదర్శకాలివే..
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తో అన్ని రంగాలతో పాటు చిత్ర పరిశ్రమ సైతం మూతపడింది. ఇక దేశంలో అన్‌లాక్ 5.0 ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 15వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు 50 శాతం సీటింగ్‌తో తెరుచుకోవచ్చని మార్గదర్శకాల్లో తెలిపింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. దాదాపు .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5.2,500 ఏళ్లయినా చెక్కు చెదరలేదు
ఈజిప్టు చరిత్ర గుర్తుకు వస్తే మమ్మీలే గుర్తుకు వస్తాయి. ఏళ్లనాటి మమ్మీలను వెలికి తీసి వాటి చరిత్రను తవ్వి తీయడంలో అక్కడి శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ఏడాది ఆరంభంలో సక్కారా ప్రాంతంలో 59 మమ్మీలను వెలికి తీశారు. సక్కారా అనేది ఈజిప్టులో పురాతన శ్మశానవాటిక. ఇక్కడ వెలికి తీసిన మమ్మీలు దాదాపు 2,500 ఏళ్ల క్రితానికి చెందినవిగా గుర్తించారు శాస్త్రవేత్తలు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6.రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ దుర్మరణం
ఆఫ్గాన్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణించిన అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారి ఘటన మరువకముందే.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నజీబ్ తరకాయ్(29) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7.బిగ్‌బాస్-4కు నాగార్జున దూరం కానున్నాడా..?
తెలుగులో స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ -4కు హోస్టుగా నాగార్జున చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ షోలో పెద్దగా తెలిసిన సెలబ్రెటీలు లేకపోయినా.. తన టైమింగ్, పంచ్‌లతో షోను అదరగొడుతున్నారు. ప్రారంభంలో ఈ షోకు రేటింగ్ పెద్దగా లేకపోయినా.. మెల్లమెల్లగా రేటింగ్ పెంచేలా కృషి చేశారు నాగార్జున. ఇక ఈ సీజన్ నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలో అడుగు పెట్టింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8.చాయ్‌వాలా టూ ర్యాంప్ వాక్ మోడల్.. ఒక్క ఫోటో జీవితాన్ని మార్చేసింది గురూ..!
అర్షద్ ఖాన్.. ఒక్కఫొటోతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిన నీలి కళ్ల చాయ్‌వాలా. నాలుగేళ్ల క్రితం జియా అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఏకంగా అర్షద్ జీవితమే మారిపోయింది. చాయ్‌వాలా నుండి ఏకంగా మోడల్‌గా మారిపోయాడు. ఓ చిన్న దుకాణంలో టీ అమ్మిన అర్షద్.. నాలుగేళ్లు గిర్రున తిరిగేసరికి ఓ భారీ కేఫ్‌కు యజమానిగా మారిపోయాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9.కాజల్ పెళ్లికి ముహూర్తం ఖరారు.. ప్రకటించిన ముద్దుగుమ్మ
టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్ 30న ముంబాయిలో తన వివాహ వేడుక జరగబోతున్నట్లు కాజల్ అధికారికంగా వెల్లడించింది. గౌతమ్ కిచ్లును ఈనెల 30న వివాహం చేసుకోబోతున్నట్లు, ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ముంబాయిలో ఆత్మీయుల సమక్షంలో పెళ్లి వేడుక జరగబోతోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10.Fact Check : ఒంటికి ముళ్ల కంచె చుట్టుకున్న మహిళ.. హత్రాస్ ఘటనకు నిరసన తెలుపుతోందా..?
ఒంటి చుట్టూ ముళ్ల కంచె చుట్టుకుని.. ఇనుప షీట్స్ ఒంటి మీద ధరించిన ఓ మహిళ ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. హత్రాస్ ఘటనకు నిరసనగా ఆమె భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఆమె ఇలా వైవిధ్యంగా ప్రయత్నించింది అని చెబుతూ ఉన్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి