టాలీవుడ్‌ ముద్దుగుమ్మ కాజల్‌ పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 30న ముంబాయిలో తన వివాహ వేడుక జరగబోతున్నట్లు కాజల్‌ అధికారికంగా వెల్లడించింది. గౌతమ్‌ కిచ్లును ఈనెల 30న వివాహం చేసుకోబోతున్నట్లు, ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ముంబాయిలో ఆత్మీయుల సమక్షంలో పెళ్లి వేడుక జరగబోతోంది. జీవితంలోని ఈ కొత్త ఆరంభం కోసం మే ఎంతో థ్రిల్లింగ్‌గా ఎదురు చూసున్నాం. మీ అందరూ కూడా ఈ ఆనందంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నా.. ఇన్నేళ్లుగా మీరంతా నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ తెలిపింది. ఈ కొత్త ప్రయాణంలో మేం మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. పెళ్లి తర్వాత కూడా నేను నా నటనను కొనసాగిస్తాను. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాను అంటూ కాజల్‌ వెల్లడించింది. ఈ పోస్టును కేవలం 40 నిమిషాల్లోనే 2 లక్షలకుపైగా మంది లైక్‌ చేశారు. మరోవైపు కాజల్‌-గౌతమ్‌ కలిసి దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో కాజల్‌ నిశ్చితార్థం జరిగిందని, గత కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. త్వరలో వీరి పెళ్లి ముంబాయిలో జరుగనుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తలను కాజల్‌ అగర్వాల్ పోస్టు ద్వారా నిజం చేశారు.

ఇక గత ఏడాది సీత, రణరంగం సినిమాలతో ముందుకొచ్చిన కాజల్‌.. ప్రస్తుతం ఆచార్య, మోసగాళ్లు, భారతీయుడు-2, ముంబాయి సగ తదితర సినిమాల్లో నటిస్తున్నారు.

Kajal Aggarwal Announces Wedding 1

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort