మరో 30 ఏళ్ళ పాటు జగన్ ప్రభుత్వమే ఉంటుంది

YSRCP Mla Bhumana Karunakar Reddy about Jagan Governance. ఏపీలో మరో 30 ఏళ్ళ పాటు సీఎం జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంద‌ని

By Medi Samrat  Published on  4 Jun 2022 2:57 PM IST
మరో 30 ఏళ్ళ పాటు జగన్ ప్రభుత్వమే ఉంటుంది

ఏపీలో మరో 30 ఏళ్ళ పాటు సీఎం జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంద‌ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం గడపగడపకు మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమంలో భాగంగా కొర్లగుంట, జీవకోన ప్రాంతాల్లో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్ ప్రజా రంజక పాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో సంక్షేమ పథకాలు వెలుగులు నింపుతున్నాయన్నారు. తిరుపతిలో గత ఎన్నికల్లో వైసీపీకి 89 వేల మంది ఓట్లు వేస్తే.. ఈ మూడేళ్ళలోనే 2 లక్షల 20 వేల మందికి 1600 కోట్ల రూపాయల మేరకు లబ్ది చేకూర్చినట్టు వెల్లడించారు.

దీంతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వ‌చ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ కి ఓట్లు వేసి, విజయం చేకూరుస్తామని ప్రజలే స్వచ్ఛందంగా చెబుతున్నారని భూమన వివరించారు. ముఖ్యమంత్రి జగన్ తన మూడేళ్ల పాలనలో చేపట్టిన సామాజిక ఆర్థిక హిత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు వాటి లక్ష్యాల గురించి ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని కార్యకర్తలుగా తమకు ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుపతిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.











Next Story