28న తిరుమల శ్రీవారి కానుకల వేలం

తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి సమర్పించిన కానుకలకు సంబంధించి టీటీడీ వేలంపాటను నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే

By Medi Samrat
Published on : 24 Aug 2024 8:45 PM IST

28న తిరుమల శ్రీవారి కానుకల వేలం

తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి సమర్పించిన కానుకలకు సంబంధించి టీటీడీ వేలంపాటను నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వాచీలు, కెమెరాలకు సంబంధించిన వేలంపాటకు అధికారులు తేదీలను నిర్ణయించారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 06 లాట్లు ఆగష్టు 28వ తేదీన టెండర్ కమ్ వేలం జరుగనుంది.

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ – 2, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు ఆగష్టు 30, 31వ తేదీలలో టెండర్‌ కమ్‌ వేలం (ఆఫ్‌లైన్‌) వేయనున్నారు. ఇందులో కాపర్ – 2 (3000కేజిలు) -15 లాట్లు ఆగష్టు 30న, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు (2,400 కేజిలు) -12 లాట్లు ఆగష్టు 31వ తేదీ వేలానికి ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలం) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Next Story