బైక్‌ సైలెన్సర్ల‌ను రోడ్డు రోలర్‌తో ద్వంసం చేయించిన ఎస్పీ

Tirupati SP Take Action Against Violators. తిరుపతి నగరంలో బుల్లెట్ వాహనాలకు సైలెన్సర్, హారన్ లను మార్పిడి చేసి అదిక శబ్దం వచ్చే విధంగా

By Medi Samrat  Published on  5 Aug 2021 8:56 PM IST
బైక్‌ సైలెన్సర్ల‌ను రోడ్డు రోలర్‌తో ద్వంసం చేయించిన ఎస్పీ

తిరుపతి నగరంలో బుల్లెట్ వాహనాలకు సైలెన్సర్, హారన్ లను మార్పిడి చేసి అదిక శబ్దం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకొని శబ్ద కాలుష్యన్ని విపరీతంగా కలిగిస్తునారు. వీటిపై నగరంలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అధిక శబ్దం కలిగించే బుల్లెట్లను గుర్తించాము. సీజ్ చేసినటువంటి సైలన్సర్ లను రోడ్డు రోలర్ ద్వారా ద్వంసం చేయడం జరిగింది. అంతే కాకుండా వారి వలన ప్రజలు పడే ఇబ్బందుల గురించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడు వివరించారు.

నగరంలో గత కొద్ది రోజులుగా బుల్లెట్ వాహనాలకు 65 డెసిబెల్ కంటే ఎక్కువగా శబ్దం కలిగించే వాహనాలను గుర్తించాము. యువత, కాలేజీ విద్యార్ధులు ఫ్యాషన్ లు కొరకు బైక్ లకు షోరూమ్ నుండి రిజిస్టరుగా వచ్చిన సైలెన్సర్ లను మార్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తునారు. మోటారు వాహన చట్టానికి వ్యతిరేకంగా అదేవిధంగా అతిక్రమించడంగా అవుతుంది. అధిక మోతాదులో శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్ లను అమర్చుకోకూడదు. దాని వలన శబ్ద కాలుష్యం అధికంగా ఉండటం వలన రోడ్డుపై భయబ్రాంతులకు ప్రజలు లోనవుతున్నారు. అలాగే నివాసాలలో ఉన్నవారు కూడా చాలా ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు.

స్పెషల్ డ్రైవ్ లో భాగంగా చాలా మంది అధిక శబ్దం కలిగించే ద్విచక్రవాహనాల సీజ్ చేయడం జరిగింది. అలాగే సైలెన్సర్ లను మార్చుకునే అవకాశం కూడా ఇచ్చాము. ఇలాంటి వారిని జిల్లా మొత్తం ఎక్కడ వాహనాలు నడిపినా అట్టి వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదు, మన చుట్టూ ఎన్నో హాస్పిటల్స్, స్కూల్స్, దేవాలయాలు, ఇంకా ముఖ్యమైన ప్రదేశాలు ఉనాయి. ఈ అధిక శబ్దం వలన వాటికి బంగం కలిగించకూడదు, రిజిస్టర్ ప్రకారం వాహనానికి వచ్చిన సైలేన్సుర్లను మార్చకండి దయచేసి తల్లి తండ్రులు కూడా గమనించి ముచ్చట పడకుండా బాద్యత వహించాలి. మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో కూడా వృద్దులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసిపిల్లలు ఉంటె వారికి ఈ సైలెన్సర్ శబ్దం వల్ల ఎంత ఇబ్బంది కలిగే విధంగా ఉంటుందో ఒక్కసారి గుర్తిచాలన్నారు.

ముఖ్యంగా యువత ఒక్క విషయం గుర్తించుకోవాలి. అధిక శబ్దం వలన వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడ్తుంది, ర్యాష్ డ్రైవింగ్ను ఎలాంటి పరిస్తిత్లో కూడా ఒప్పుకునేది లేదు, ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని హరించే హక్కు మనకు లేదు మనందరికీ ఒక కుటుంబం ఉంటుంది అందులో తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలా ఎన్నో బంధాలు ముడిపడి ఉంటుంది. మనకు మన ఇంటి సభ్యులపై ఎంత ప్రేమ ఉంటుందో అలాగే ఎదుటవారికి కూడా ఉంటుంది.

మనం ఇతరులకు కలిగించే హాని మనకు ఇతరుల వల్ల హాని జరిగితే ఎలా ఉంటుందో ఉహించండి.. ప్రేమైన ఒక్కటే ప్రాణమైన ఒక్కటే ఏది కొల్పోయిన తిరిగి రాదు, ర్యాష్ డ్రైవింగ్, ఫ్యాషన్లపై ఉన్న శ్రద్ధ మీ ఎదుగుద‌ల మీద చూపించండి.. ప్రయోజకులు అవుతారు. జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని విధాలుగా అవగాహన కార్యక్రమాలు జరుపుతూ ఉంది. బుల్లెట్ వాహనాలను కొనుగోలుచేసే వారి తల్లిదండ్రులను గుర్తించి వారికి త్వరలో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.


Next Story