తిరుమలకు వెళ్తున్నారా..? మీకో అప్డేట్..!
తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీవాణి దర్శన టికెట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat
తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీవాణి దర్శన టికెట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఏ రోజుకు ఆరోజే శ్రీవారి దర్శన టికెట్లను ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆ టికెట్ దర్శనానికి మూడు రోజుల టైమ్ పడుతుంది. ఆగస్టు 1 నుంచి 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఉదయం శ్రీవాణి టికెట్ తీసుకుంటే అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 1 నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకుని రానున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుచానూరులో ఆగస్టు 8వ తేదీ శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు నేరుగా వ్రతంలో పాల్గొనేందుకు జూలై 31న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. అదేవిధంగా ఆలయం సమీపం కౌంటర్‌లో ఆగస్టు 7న ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల సేవ, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం సేవలను టిటిడి రద్దు చేసింది.