తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల‌ విడుదల తేదీ ఖ‌రారు

Tirumala Special Entry And Sarva Darshan Tickets. తిరుమల శ్రీవారి దర్శనానికి గాను నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రూ.300

By Medi Samrat  Published on  20 Oct 2021 3:19 PM GMT
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల‌ విడుదల తేదీ ఖ‌రారు

తిరుమల శ్రీవారి దర్శనానికి గాను నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఈడి) టోకెన్లను అక్టోబరు 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న‌ట్లు టీటీడీ ప్ర‌క‌టించింది. నవంబరు నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అక్టోబరు 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అలాగే.. తిరుమలలో వసతికి సంబంధించి నవంబరు నెల కోటాను అక్టోబరు 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది.

ఇదిలావుంటే.. డిసెంబరు 8 వ తేదీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం, డిసెంబరు 16వ తేదీ ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజులకు సంబంధించి శ్రీవారి ఆలయ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ కార్యక్రమాల వివరాలు ఖరారయ్యాక డిసెంబరు 8, 16 వ తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. భక్తులు ఈ విషయం గుర్తించి స్వామి వారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.


Next Story
Share it