కోదండ రామునికి శ్రీవారి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు

Srivari gold crowns and silks for Kodanda Ram. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు

By Medi Samrat  Published on  15 April 2022 1:22 PM GMT
కోదండ రామునికి శ్రీవారి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శుక్రవారం ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్న ఈ కానుకలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆలయానికి అందజేశారు. ఆలయం ఎదుట ఆభరణాలు, పట్టు వస్త్రాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

అనంతరం వీటిని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకుని వెళ్ళి అర్చకులకు అందజేశారు. కోదండరామాలయం లోని మూల మూర్తికి ఒకటి, ఉత్సవ మూర్తులకు మూడు కిరీటాలు శ్రీవారి ఆలయం నుంచి వచ్చాయి. ఆలయ ప్రాంగణంలో ని యాగశాలను దర్శించి, సీతారాముల పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెఈవో వీర బ్రహ్మం, డిప్యూటీ ఈవో రమణ ప్రసాద్ పాల్గొన్నారు.


Next Story
Share it