సెప్టెంబరు 6న ఖాళీ టిన్‌ల విక్రయానికి టీటీడీ సీల్డ్ టెండర్ల ఆహ్వానం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళీ టిన్‌ల విక్ర‌యానికి టీటీడీ సీల్డ్ టెండ‌ర్ల‌ను ఆహ్వానిస్తోంది.

By Medi Samrat  Published on  3 Sep 2024 2:00 PM GMT
సెప్టెంబరు 6న ఖాళీ టిన్‌ల విక్రయానికి టీటీడీ సీల్డ్ టెండర్ల ఆహ్వానం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళీ టిన్‌ల విక్ర‌యానికి టీటీడీ సీల్డ్ టెండ‌ర్ల‌ను ఆహ్వానిస్తోంది. టెండ‌ర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళి టిన్‌లు సేక‌రించ‌వ‌చ్చు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండ‌ర్లు సెప్టెంబరు 6వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు అంద‌జేయాల్సి ఉంటోంది. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించాలని టీటీడీ తెలిపింది.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమత్తు పనులు పూర్తయి కొత్త హంగులతో తీర్చిదిద్దిన స్వామి పుష్కరిణిలోనికి శ్రీవారి భక్తులను టీటీడీ అనుమతిస్తూ ఉంది. ఈ మరమత్తు పనులు టీటీడీ ఆగష్టు 1వ తేదిన ప్రారంభించారు. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్‌ విబాగం దాదాపు 100మంది కార్మికులు స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు. స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు (పెయింటింగ్‌) అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమత్తు పనులు పూర్తిచేశారు.

Next Story