ఫిబ్రవరి 5న నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు

Donations Counting in Parakamani Bhavan at Tirumala. తిరుమలలో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు

By Medi Samrat  Published on  31 Jan 2023 8:45 PM IST
ఫిబ్రవరి 5న నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు

తిరుమలలో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం నిర్వహిస్తారు. అనంతరం కానుకలను వేరుచేయడం, లెక్కించడం చేపడతారు.

తిరుమ‌లలో స్వామివారి హుండీ కానుక‌లు లెక్కించ‌డానికి బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాత‌న సౌక‌ర్యాల‌తో కూడిన నూత‌న పరకామణి భవనం నిర్మించారు. శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా 2022 సెప్టెంబరు 28న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అభివృద్ధి పనులు పూర్తి చేసి సిద్ధం చేశారు.


Next Story