టీటీడీలో ఉద్యోగాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని చేస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్ధని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. గతంలో టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది దళారులు మోసపు మాటలు చెప్పి కొంతమంది అమాయకుల నుండి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని ప్రకటలో తెలిపారు.
టీటీడీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేటప్పుడు ముందుగా పత్రికల్లో, టీటీడీ వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన (నోటిఫికేషన్) ఇవ్వడం జరుగుతుందని తెతిపారు. ఇలాంటి విషయాలపై టీటీడీ గతంలో కూడా ప్రజలకు స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగిందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి అవాస్తవ ప్రకటనలు నమ్మవద్దని టీటీడీ కోరింది. ఇలాంటి అవాస్తవ ప్రచారం చేసేవారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది.