తన అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఆస్పత్రికి పవన్ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న అభిమానులు పెద్దగా నినాదాలు చేశారు. దీంతో “మనుషులు చనిపోయారు.. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా..? మీకు బాధలేదా?. కొంత కూడా బాధ్యతలేకపోతే ఎలా” అని మండిపడ్డారు.
శ్యామలరావు, వెంకయ్య చౌదరి విఫలమయ్యారు.. మీరు చేసిన తప్పులకు ప్రభుత్వం నిందలు మోస్తోంది.. పోలీసులు క్రౌడ్ మేనేజింగ్ చేయడంలో విఫలమవుతున్నారు.. తప్పు జరిగింది, పూర్తి బాధ్యత తీసుకుంటున్నాం.. తొక్కిసలాట జరిగినప్పుడు హెల్ప్ చేసిన పోలీసులు ఉన్నారు.. అలాగే చోద్యం చూసిన పోలీసులు ఉన్నారు.. పోలీసుల్లో కొందరు కావాలనే వ్యవహరించినట్టు బాధితులు చెప్పారు.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్