టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు.. కిరణ్ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న కిరణ్ కుమార్ కు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ కస్తూరి బాయి తదితరులు పాల్గొన్నారు.