తిరుమల శ్రీవారి దర్శనానికి చాలా తక్కువ సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి కేవలం 6 గంటల సమయం మాత్రమే పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 3 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం తిరుమలేశుడిని 75,356 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,815 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.90 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.